వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన… తిరుమల నడిచి వెళ్తారు, తలనీలాలు సమర్పిస్తారు, డిక్లరేషన్ పై సంతకం చేస్తారు, ప్రమాణ స్వీకారం చేస్తారు… ఇలా జగన్ తిరుమల టూర్ పై ఎవరికి నచ్చిన వెర్షన్ వాళ్ళు వినిపించారు. కాని జగన్ మాత్రం తిరుమల వెళ్ళే ప్రయత్నం చేయలేదు. వెళ్ళకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేసారు. నా మతం మానవత్వం, డిక్లరేషన్ మీద రాసుకోండి, వైఎస్ కొడుకుని, ఇలా తన మార్క్ కామెంట్స్ జగన్ చేసారు. కాని తిరుమల వెళ్తా అని చెప్పకుండానే బెంగళూరు వెళ్ళిపోయారు.
అయితే ఇక్కడ జగన్ ను కొన్ని భయాలు దారుణంగా వెంటాడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా జగన్ కు సాలిడ్ మాల, క్రైస్తవ ఓటు బ్యాంకు ఉంది. క్రైస్తవులు కచ్చితంగా హిందు సాంప్రదాయాలను ఏ మాత్రం ఇష్టపడే అవకాశం ఉండదు. అప్పట్లో సోనియా గాంధీ సంతకం చేయడానికి భయపడిన విషయం కూడా ఇదే. ఇప్పుడు జగన్ భయపడుతుంది కూడా ఈ విషయంపైనే. దేవుడిపై నమ్మకం ఉందని జగన్ సంతకం చేస్తే కచ్చితంగా మెజారిటీ క్రైస్తవుల ఓట్లు కోల్పోయే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.
Read Also : జత్వాని ఐఫోన్ కోసం సీతారామాంజనేయులు పాడు పని
ఏ మాటకు ఆ మాట లడ్డు విషయంలో ఒక వర్గం సోషల్ మీడియాలో సంతోషంగా ఉంది. ఏకంగా ఆవు మూత్రం తాగినప్పుడు, ఆవు పేడ వాడినప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. వాళ్ళల్లో చాలా మంది జగన్ కు గుడ్డిగా మద్దతు ఇచ్చే వాళ్ళే. ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేసే వాళ్ళే. ఇక క్రైస్తవ సంఘాలు కూడా జగన్ సంతకం చేస్తే కచ్చితంగా ఆయనను దూరం పెట్టె అవకాశమే ఉంది. అందుకే జగన్ గాని భారతి గాని ప్రసాదం కూడా తినే ప్రయత్నం చేయరు. ఈ భయాలతోనే జగన్ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. మానవత్వం అంటూ హీరోయిజం చూపించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మానవత్వం ఎలా ఉంటుందో వివేకానంద రెడ్డి హత్య చూసిన వాళ్లకు ఓ క్లారిటీ ఉంది. మరి రాబోయే 5 ఏళ్ళలో జగన్ తిరుమల వెళ్తారో లేదో చూడాలి.