Friday, September 12, 2025 08:52 PM
Friday, September 12, 2025 08:52 PM
roots

ఆయన సీఎం పదవి ఐదేళ్లూ సేఫేనా…?

నిరీక్షణకు తెరపడింది… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మొండికేసిన షిండే … మద్దతు పలికారు. నాలుగు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత… రాష్ట్రంలో బీజేపీని నిలబెట్టడంలో ఫడ్నవీస్‌ కీలకపాత్ర పోషించారు. అయితే ఏక్‌నాథ్‌ షిండే అంగీకరించినా… ఇంకా అలక పోలేదు. ముఖ్యమంత్రి ఎన్నికపై చర్చలకు రమ్మని బీజేపీ అధిష్టానం పిలిచినా… కొన్నాళ్లు ఆరోగ్యం బాగాలేదంటూ ఇంటికే పరిమితమయ్యారు షిందే. సీఎం పదవి లభించదేమోనని ముందే కినుక వహించారు.

Also Read : ఏపీ ముఖచిత్రం మార్చేసిన 2024…!

ఏక్‌నాథ్‌ షిందే పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఏమాత్రం అవకాశం ఉన్నా మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న ఆలోచనలో ఉన్నారు. సొంత పార్టీలోనూ నితిన్ గడ్కరీ, ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే, వినోద్ తావ్డే, చంద్రకాంత్ పాటిల్‌ లాంటివారు… దేవేంద్ర ఫడ్నవీస్‌కు వ్యతిరేకం. వీరిలో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం తగ్గింది. ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే, వినోద్ తావ్డేలు వరుస వివాదాలతో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణల కారణంగా ఖడ్సే గతంలో మంత్రి పదవి కోల్పోయారు. అయితే మంత్రి వర్గ కూర్పు.. కూటమి నేతలను సంతృప్తి పరచడం అంత తేలిక కాదు.

దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం మహారాష్ట్ర… ముంబై, పూణేలాంటి మహా నగరాలున్నాయి. ఇలాంటి చోట రాజకీయాలు చేయడం సామాన్యమైన విషయం కాదు… హేమా హేమీలున్నారు. అయితే సమకాలీన నాయకులతో పోలిస్తే దేవేంద్ర ఫడ్నవిస్‌ చాలా చిన్న. ఆర్‌ఎస్ఎస్‌తో ఈయన కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. విద్యార్థి దశలో ఏబీవీపీలో ఉండటం… ఆర్‌ఎస్ఎస్‌ నేపథ్యం ఫడ్నవిస్‌కు బాగా కలిసొచ్చింది. 1992లో 22 ఏళ్లకే నాగపూర్‌ మున్సిపల్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాగపూర్‌ మేయర్‌ అయ్యారు. 1999 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి శాసన సభలో అడుగుపెట్టారు. మొదట్లో గడ్కరీని అనుసరించేవారు… తర్వాత గోపీనాథ్ ముండే వర్గానికి దగ్గరయ్యారు. అలా 2013లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకోగలిగారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆర్ఎస్ఎస్‌లో కీలక సభ్యుడు… బీజేపీ అధిష్టానానికి వీర విధేయుడు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ – షా సారథ్యంలోని బీజేపీ నితిన్ గడ్కరీకి అంత అనుకూలంగా లేదు. దీంతో… దేవంద్ర ఫడ్నవీస్‌… మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు.

Also Read : ఏపీలో విమానాశ్రయాలకు కొత్త కళ

ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఫడ్నవీస్ మహారాష్ట్రలో అధికార కేంద్రంగా ఎదిగారు. మోదీ అడుగుజాడల్లో నడుస్తూ, ఒకవైపు అభివృద్ధి ఇమేజ్, మరోవైపు పార్టీలో తన ప్రత్యర్థులను తగ్గించుకోవడం వంటి వ్యూహాలను అమలు చేశారు. అయితే మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ను నడిపించడం అంత తేలికకాదు. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288కాగా … బీజేపీకి 132 సీట్లలో విజయం సాధించింది. శివసేన (షిండే వర్గం) 57 స్థానాల్లో గెలిచింది, ఎన్సీపీ 41 చోట్ల గెలుపొంది సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు అవసరం… అంటే విజయానికి 13 సీట్ల దూరంలోనే ఉండిపోయింది బీజేపీ. అందుకే మిత్రపక్షాలను గౌరవిస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి… దేవేంద్ర ఫడ్నవిస్‌ది.

Also Read : ఏపీలో కొత్త ఫిలిం పాలసీ.. కొత్త మార్పులు ఇవే..!

నిజానికి గత 30 ఏళ్లుగా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాలే.. సింగిల్‌ పార్టీ గవర్నమెంట్‌ ఇప్పటి వరకు లేదు. 1995 నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. పొత్తు లేకపోతే మహారాష్ట్ర రాజకీయాల్లో చిత్తే. కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్రలో 1990లో 141 సీట్లు గెలుచుకుని సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేనకు 1995 ఎన్నికల్లో 73, బీజేపీకి 65 సీట్లు దక్కాయి. ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 1999 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చీలిక వచ్చి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఎన్సీపీ 58 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేసినా ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కటయ్యాయి. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు కూటమి పాలించింది. 2014లో నాలుగు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 122, శివసేనకు 63 రావడంతో … దేవంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపొందడంతో, కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడంతో ఇరు పార్టీలు విడిపోయాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకున్నాయి. థాక్రే నేతృత్వంలోని మూడు పార్టీల ప్రభుత్వం జూన్ 2022 వరకు కొనసాగింది. ఆ సమయంలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. సేనను షిండే చీల్చి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తిరుగుబాటు నేతగా షిండే నాయకత్వాన్ని ప్రజలు సైతం ఆమోదించారు. అయితే ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో… షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్