Friday, September 12, 2025 03:24 PM
Friday, September 12, 2025 03:24 PM
roots

బాబును తిడితేనే పెద్ద పదవులు..!

లడ్డూ కావాలా నాయానా.. అంటూ డెయిరీ మిల్క్ ఇచ్చిన యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే పదవి కావాలా నాయానా అంటే.. చంద్రబాబును తిట్టావా నువ్వు అంటూ గత చరిత్రను పరిశీలిస్తున్నారు. చంద్రబాబును ఎవరైతే తిట్టారో.. వాళ్లకే కీలక పదవులు వస్తాయనేలా బీజేపీ అగ్రనేతలు వ్యవహరిస్తున్నారు. పదవి కావాలంటే కేవలం చంద్రబాబును తిడితే సరిపోతుంది.. అంతే తప్ప.. ప్రజల్లో ఏ మాత్రం గుర్తింపు అవసరం లేదు అనే సూత్రం ఇప్పుడు బీజేపీ పెద్దలు పాటిస్తున్నారు. గ్రామస్థాయి పదవులు మొదలు.. ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇదే సూత్రం పాటిస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఇదే విధానం అమలు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఓ వైపు కూటమిలో కీలకంగా వ్యవహరిస్తూనే.. చంద్రబాబు వ్యతిరేకులకు బీజేపీ అగ్రపీఠం వేస్తోంది.

Also Read : చంద్రబాబు “మైక్రోసాఫ్ట్” స్ట్రాటజీ వర్కౌట్ అయిందా..?

2014 ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అప్పటి వరకు పదేళ్ల యూపీఏ పాలనకు చరమగీతం పాడాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పెద్దలు.. దక్షిణాదిలో కీలకమైన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. నాటి పరిస్థితులను అంచనా వేసుకున్న చంద్రబాబు కూడా ఎన్డీయే సర్కార్‌లో భాగస్వామి అయ్యారు. అయితే 2019 ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోదీ సర్కార్‌కు పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా వ్యవహరించారు. ఒకదశలో పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం కూడా లేకుండా చేశారు. టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది బహిరంగ రహస్యం కూడా. ఇందుకు కొందరు వైసీపీ నేతలు కూడా సహకరించారు. అయితే 2024 ఎన్నికల సమయానికి మోదీ సర్కార్‌పై వ్యతిరేకత ఎక్కువైంది.

Also Read : అమరావతి అన్ స్టాపబుల్.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

రాహుల్ భారత్ జోడో యాత్ర వల్ల ఇబ్బందులు తప్పవని భావించిన బీజేపీ అగ్రనేతలు.. మూడోసారి అధికారంలోకి రావాలంటే.. తప్పనిసరిగా చంద్రబాబు మద్దతు ఉండాల్సిందే అని భావించారు. దీంతో ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ పెద్దలు మరోసారి తమ ద్వంద్వ నీతిని బయటపెట్టారు. అప్పటి వరకు చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించిన బీజేపీ నేతలు.. పదవుల కేటాయింపులో మాత్రం.. బాబును తిట్టిన వారికే పదవులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీకి కేటాయించిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుకు ఇచ్చారు. దీనిపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 2019-2023 మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షునిగా వ్యవహరించిన సమయంలో సోము వీర్రాజు టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా రెచ్చిపోయారు. అలాంటి నేతకు ఎలా ఇస్తారని అప్పట్లోనే టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే ఇవేవీ పట్టించుకోని బీజేపీ నేతలు.. తాజాగా పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు.

Also Read : ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటా: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వాస్తవానికి పాకా సత్యనారాయణ బీజేపీలో సీనియర్ అయినప్పటికీ.. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సాక్షి టీవీ డిబేట్‌లో పదేపదే పాల్గొన్న పాకా సత్యనారాయణ.. “రాష్ట్రంలో సమస్యలకు చంద్రబాబే కారణం.”, “చంద్రబాబు పెద్ద పెద్ద పంగనామాలు పెట్టాడు..”.., “రాజశేఖర్ రెడ్డిలాంటి మిత్రుడు లేకపోవడం లోటు..” అంటూ వ్యాఖ్యలు చేసిన పాకా సత్యనారాయణ.. చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని.. “ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేత చంద్రబాబు” అంటూ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మరి ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారికి పదవులు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు టీడీపీ నేతల ప్రశ్న. వాస్తవానికి వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. బీజేపీకీ ఏపీలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అందరికీ తెలిసిని విషయమే. ఆ స్థానం బీజేపీ గెలవాలంటే.. టీడీపీ మద్దతు తప్పనిసరి. అంటే.. టీడీపీని తిట్టిన వారికే టీడీపీ మద్దతు ఇస్తుందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్