Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

ఇండియన్ సినిమాపై ఇరాన్ స్పెషల్ లవ్.. న్యూస్ పేపర్ లో స్పెషల్ ఆర్టికల్

షోలే” ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ బ్యూటి. అప్పటి వరకు ఉన్న రికార్డులనే కాదు.. ఇప్పటి వరకు బ్రేక్ చేయలేని కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఈ అల్టిమేట్ బ్లాక్ బస్టర్. హీరోలే సినిమాకు గుండె కాయ కాదు విలన్ కూడా అని నిరూపించి.. విలన్ ను కూడా ఓ రేంజ్ లో ఫేమస్ చేసిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వస్తే చూసే ఫ్యాన్స్ ఉన్నారు. నేటి తరానికి కూడా ఎంతగానో నచ్చే సినిమా ఇది. ఎంతో మంది నటులకు సినిమా పరిశ్రమలో ప్రాణం పోసిన సినిమాగా కూడా ఈ సినిమాను చెప్తారు.

Also read ; భారత్ లో అడుగు పెడుతున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన

అలాంటి సినిమాపై ఓ పాశ్చ్యాత్య దేశం తన ప్రేమ చూపించింది. షోలే 50వ విడుదల వార్షికోత్సవానికి ఒక నెల ముందు , ఇరాన్ తన వార్తాపత్రికలలో పూర్తి పేజీని కేటాయించి కథనం రాసింది. 1975లో వచ్చిన ఈ సినిమాను, చిత్ర బృందాన్ని అభినందించింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమ మాలిని, సంజీవ్ కుమార్, జయ బచ్చన్, అమ్జద్ ఖాన్ వంటి స్టార్ లు నటించిన ఈ సినిమాకు . రమేష్ సిప్పీ దర్శకత్వం వహించగా, సలీం ఖాన్, జావేద్ అక్తర్ సహ రచయితలుగా వ్యవహరించారు.

Also read ; మేము లోంగిపోతాం.. మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతల సమాచారం

ముంబైలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ అధికారిక X పేజీ ప్రకారం, షోలే సినిమాకు ఇరాన్ లో ఇప్పటికీ ఆదరణ ఉందట. గబ్బర్ సింగ్ ఇరాన్ లో కూడా ఫేమస్ అయ్యాడని అక్కడి పౌరులు ఆ పోస్ట్ కింద కామెంట్స్ కూడా చేసారు. షోలే సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుందని.. ఈ సినిమాలో ఇద్దరి మధ్య స్నేహాన్ని చాలా గొప్పగా చూపించారు అంటూ కొనియాడింది. ఉర్దూలో ఉన్న ఆ పత్రిక పేజీని కూడా పోస్ట్ చేసింది. ఈ సినిమాలో కొన్ని ఫేమస్ డైలాగులు మనకు ఇప్పటికీ వినపడతాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్