దాదాపు రెండు వారాల నుంచి జరుగుతోన్న ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్టే కనపడుతోంది. ఇరాన్ దారికి వచ్చే అవకాశాలు లేకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఓ ప్రకటన చేసారు. అయినా సరే ఇరాన్ మాత్రం ఇజ్రాయిల్ విషయంలో వెనకడుగు వేయడం లేదు. తన దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. దక్షిణ ఇజ్రాయెల్ నగరమైన బీర్ షెవాలో మంగళవారం ఉదయం ఇరాన్ క్షిపణి దాడి చేసింది.
Also Read : రెండు సెంచరీలు.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన పంత్
క్షిపణి నివాస భవనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గత 12 రోజులుగా రెండు దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయి. బద్ధ శత్రువుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ దాడి చేసింది. దీనిపై ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. కాల్పుల విరమణకు ముందు తాము దాడి చేసామని.. విరమణ తర్వాత అవి ఇజ్రాయిల్ చేరుకున్నాయని తెలిపింది. ఇక ఈ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్.. మా రియాక్షన్ కు రెడీగా ఉండు
సీజ్‌ఫైర్ ఇప్పుడు ప్రభావం చూపుతోంది. దయచేసి దానిని ఉల్లంఘించవద్దు అని ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఖతార్‌లోని ఒక అమెరికన్ సైనిక స్థావరంపై టెహ్రాన్ దాడులు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్.. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై ప్రకటన చేసారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన ఫోన్ కాల్‌లో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని, ఇరాన్ మరిన్ని దాడులు చేయనంత వరకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వైట్ హౌస్ సీనియర్ అధికారి తెలిపారు.