2019లో వైయస్ జగన్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐపాక్ టీం ఎంతో సహకరించింది. ఎన్నికల వ్యూహాలతో పాటుగా జగన్ వ్యక్తిగత ప్రవర్తన పై కూడా ఐపాక్ ప్రభావం గట్టిగానే పడింది. వాళ్లు కూర్చోమంటే కూర్చుని నిలబడమంటే నిలబడి.. వాళ్లు ఏం చెప్తే అది చేసిన జగన్… 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా వాళ్లే కారణమయ్యారు. రాజకీయాల్లో ముద్దులతో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన జగన్.. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అవే పాత ట్రిక్స్ ప్లే చేయడం వైసిపి కార్యకర్తల్లో చిరాకు పెంచుతోంది.
Also Read : జగన్ కామెంట్స్ తో డైలమాలో వైసీపీ సోషల్ మీడియా
ఆ టీం జగన్ కోసం ఇప్పటికీ గట్టిగానే వర్క్ చేస్తుంది. అయితే లేటెస్ట్ గా విజయవాడ ఎపిసోడ్లో చిన్నారి ఏడుపులు, ఆ తర్వాత ముద్దులు కాస్త ఫన్నీగా మారాయి. ఆ చిన్నారి గుక్క పట్టి ఏడవటం, ఆ తర్వాత జగన్ దగ్గరికి తీసుకునీ ముద్దులు పెట్టడం వరకు బాగానే ఉంది… కానీ ఆ తర్వాత అమ్మఒడి రాలేదంటూ ఆ చిన్నారి సాక్షి ఛానల్ తో మాట్లాడటం సెన్సేషన్ అయింది. ఇక దీనిపై టిడిపి సోషల్ మీడియా వెంటనే వర్క్ స్టార్ట్ చేసి ఆ చిన్నారి చరిత్ర మొత్తం బయటికి లాగింది. అమ్మ ఒడి కోసం ఎదురుచూసే కుటుంబం కాదు అనే విషయాలను సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా బయటపెట్టింది.
Also Read : వంశీ కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు
దీనితో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, వైసిపి అనుకూల మీడియా ఐపాక్ టీంకు జగన్ గుడ్ బై చెప్తే మంచిదని ఇంకా వాళ్ళని నమ్ముకుని రాజకీయం చేయడం కంటే తనను తాను నమ్ముకుని రాజకీయం చేస్తే బెటర్ అని వైసిపి కార్యకర్తలు ఆ పార్టీ అనుకూల జర్నలిస్టులు కోరుతున్నారు. పదేపదే అవే ట్రిక్స్ ప్లే చేయడం ఆ వీడియోలను జనాల్లోకి పంపడం పార్టీ పరువు తీస్తుందని.. ఇప్పటికే జగన్ మాట్లాడే మాటలకు జనాల్లో విలువ తగ్గిందని కాబట్టి అటువంటి ట్రిక్స్ ప్లే చేయకుండా జాగ్రత్త పడాలని వైసీపీ కార్యకర్తలు అధిష్టానాన్ని కోరుతున్నారు.