Tuesday, October 28, 2025 01:42 AM
Tuesday, October 28, 2025 01:42 AM
roots

తెలుగోడికి పెర్త్ లో ఛాన్స్…?

న్యూజిలాండ్ తో సీరీస్ ఓటమి నుంచి బయటకు రావడానికి భారత క్రికెట్ జట్టు… ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తోంది. సరికొత్త వ్యూహాలతో ఆసిస్ గడ్డపై అడుగు బలంగా వేసేందుకు తొలి టెస్ట్ లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో తలపడటం అంటే సాదా సీదా విషయం కాదు. పేస్ అటాక్ ను దీటుగా ఎదుర్కొని గంటల తరబడి క్రీజ్ లో నిలబడాల్సి ఉంటుంది. బుల్లెట్ లాంటి బంతులతో ఆసిస్ బ్యాటింగ్ లైనప్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే భారత జట్టు అక్కడ ప్రభావం చూపించడం సాధ్యం.

Also Read : జగన్ సభకు రావాలంటే… ఇలా చేయాలంట…!

ఈ నేపధ్యంలో పేస్ ఆల్ రౌండర్ కోసం భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో అంత గొప్పగా రాణించకపోవడంతో అతన్ని పక్కన పెట్టి… యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేసారు. పేస్ కు అనుకూలంగా ఉండే పిచ్ లపై పేస్ ఆల్ రౌండర్ ప్రభావం ఉంటుందని బలంగా నమ్ముతోంది భారత జట్టు. బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సీరీస్ తో తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్ లపై అతనికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది జట్టు యాజమాన్యం.

Also Read : గతంలో చేసిన హెచ్చరికలు ఇప్పుడేమయ్యాయి విజయసాయి?

బంతిని స్వింగ్ చేయకపోయినా… పరుగులను కట్టడి చేసి… బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెంచడంలో నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపించాడు. బంతి పాతపడిన తర్వాత కూడా మెరుగ్గా బౌలింగ్ చేయగలడు. దీనితో అతన్ని ఆస్ట్రేలియాపై ప్రయోగించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక గిల్ స్థానంలో… జైస్వాల్ కు జోడీగా… పడిక్కల్ ను పంపాలని భావిస్తోంది. రోహిత్ శర్మ తొలి టెస్ట్ కు దూరం అవుతున్న నేపధ్యంలో… గిల్ ను పంపాలి అనుకున్నా… గాయం కారణంగా అతను దూరమయ్యాడు. ఇప్పుడు పదిక్కల్ ను ఆ స్థానంలో ఆడించాలని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్