భారత్, రష్యా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో ఆయనకు భారత జర్నలిస్ట్ షాక్ ఇచ్చారు. భారత్ తో రష్యా చేస్తున్న వ్యాపారాలపై అక్కసు బయటపెడుతూ వస్తోన్న ట్రంప్.. భారత్ ను బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్దంలో భారత్.. పరోక్షంగా రష్యాకు నిధులు సమకూరుస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు ట్రంప్. ఈ కోపంలోనే పాకిస్తాన్ తో కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
Also Read : యాపిల్ భారత్ లోనే ఉంటుంది.. ట్రంప్ కు టిమ్ కుక్ షాక్
తాజాగా మరోసారి భారత్ ను బెదిరించారు ట్రంప్. ఈ తరుణంలో భారత జర్నలిస్ట్ ఒకరు ట్రంప్ కు షాక్ ఇచ్చే ప్రశ్న వేసారు. రష్యా తో అమెరికా కొనసాగిస్తున్న వాణిజ్య సంబంధాలపై జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడగగా.. ట్రంప్ సమాధానం ఇవ్వలేకపోయారు. రష్యా నుంచి ఫర్టిలైజర్, యూరేనియం అమెరికా ఎందుకు కొనుగోలు చేస్తోందని భారత జర్నలిస్ట్ ఒకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వాలో అర్ధం కాక ఆ విషయం తనకు తెలియదన్న ట్రంప్.. చెక్ చేసి చెప్తానని తప్పించుకున్నారు.
Also Read : అమెరికా బుద్ధి బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ.. సంచలన క్లిప్ వైరల్
దీనిపై ట్రంప్ ను అంతర్జాతీయ మీడియా ఓ ఆట ఆడుకుంటుంది. ట్రంప్ పరువు తీసుకున్నారు అంటూ మండిపడుతోంది. అమెరికా విషయానికొస్తే, తన అణు పరిశ్రమ కోసం రష్యా నుండి యురేనియం హెక్సాఫ్లోరైడ్, దాని ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోసం పల్లాడియం, ఎరువులు మరియు రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉందని భారత విదేశాంగ శాఖ కూడా ఆరోపించింది. ఇక ట్రంప్ బెదిరింపులకు తల వంచని ఇండియా.. రష్యాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసారు.