బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించినా.. గ్రూప్ స్టేజిలో కీలకమైన పాకిస్తాన్ తో మ్యాచ్ విషయంలో మాత్రం అభిమానులలో ఎన్నో భయాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో ఎలా సత్తా చాటుతుందో చెప్పలేని పరిస్థితి. పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి క్రికెట్ వర్గాలు. దీనితో భారత జట్టు కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడుతోంది. దీనితో తుది జట్టులో కీలక మార్పులు చేయాలని.. బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీమిండియా.
Also Read : దుమ్ము రేపిన గిల్, రోహిత్.. టోర్నీ ముందు టీంకు జోష్
ఈ నేపథ్యంలోనే జస్ప్రిత్ బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తిని తుది జట్టులో ఆడించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటుగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భావిస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ చక్రవర్తి 14 వికెట్లతో ప్రభావం చూపించాడు. ఈ 33 ఏళ్ల తమిళనాడు బౌలర్ కచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇతని కోసం ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను కూడా పక్కన పెట్టింది సెలక్షన్ కమిటీ. అయితే మొదటి మ్యాచ్లో ఆడిన వాళ్ళలో ఎవరిని పక్కన పెడతారు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
Also Read : రోహిత్ దూకుడు వెనుక వ్యూహం ఇదేనా..?
అక్షర్ పటేల్ ను పక్కన పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జడేజా లేదంటే అక్షర్ పటేల్ లో ఒకరిని తుది జట్టులో నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా ప్రభావం చూపించే ఆటగాడు. దీనితో అక్షర్ పటేల్ ను దాదాపుగా పక్కన పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ కు అర్షదీప్ సింగ్ ను కూడా తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటి మ్యాచ్లో బెంచ్ కు పరిమితమైన అర్షదీప్ సింగ్ పాకిస్తాన్ తో మ్యాచ్లో ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.




