న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ ఓడిపోయినా బాధో లేక మరేదైనా కారణమో తెలియదు గాని భారత టి20 జట్టు సఫారీ గడ్డపై చరిత్రలో నిలిచే విజయం సాధించింది. నాలుగు మ్యాచుల సీరీస్ ను 3-1 కైవసం చేసుకుని సఫారి గడ్డపై కాలర్ ఎగరేసింది. ఈ సీరీస్ విజయంలో ఇద్దరే కీలక పాత్ర పోషించారు. ఒకరు ఓపెనర్ సంజు సామ్సన్, రెండు గుంటూరు కుర్రోడు తిలక్ వర్మ. ఈ ఇద్దరి బ్యాటింగ్ దెబ్బకు సఫారి జట్టు బౌలర్లు బంతి పట్టుకోవాలంటే భయపడ్డారు. నాలుగో మ్యాచ్ లో వీరి విధ్వంశం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Also Read : భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ…?
కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 283 పరుగులు టి20లలో చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఇద్దరు ఆటగాళ్ళు ఒకే టీం నుంచి సెంచరీ చేయడం భారత్ కు ఇదే తొలిసారి టి20 క్రికెట్ లో. టెస్ట్ ఆడే దేశాల్లో అయితే భారత్ మాత్రమే ఈ ఫీట్ సాధించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన సబావూన్ డేవిజీ, డైలాన్ స్టెయిన్ 2022లో బల్గేరియాపై ఈ ఫీట్‌ను సాధించారు. జపాన్‌కు చెందిన కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్… లచ్లాన్ యమమోటో-లేక్ ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ఈ రికార్డు సాధించినా ఆ దేశాలు టెస్ట్ క్రికెట్ లో లేవు.
Also Read : పోసానికి మూడింది..!
పురుషుల టీ20 ఇంటర్నేషనల్ లో భారత్ మూడోసారి 250-ప్లస్ స్కోర్ చేసింది. గతంలో ఏ అగ్రశ్రేణి జట్టు ఈ ఫీట్ సాధించలేదు. టోటల్‌లను కొట్టింది, ఫార్మాట్ చరిత్రలో ఏ జట్టు చేయనంత ఎక్కువ. రెండో వికెట్‌కు శాంసన్, తిలక్‌లు నెలకొల్పిన అజేయమైన 210 పరుగుల భాగస్వామ్యం భారత్ కు తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యం. ఇక భారత ఆటగాళ్ళు ఈ మ్యాచ్ లో 23 సిక్స్ లు కొట్టారు. టి20 క్రికెట్ లో జింబాబ్వే ఓ చిన్న జట్టుపై ఈ ఫీట్ సాధించింది అంతే. టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాలో ఏ జట్టు చేయని స్కోర్ చేసింది భారత్. దేశవాళి క్రికెట్ లో 271 పరుగులే హైలెట్.