Friday, September 12, 2025 05:30 PM
Friday, September 12, 2025 05:30 PM
roots

ఇండియా పింక్ బాల్ టెస్ట్ ట్రాక్ రికార్డ్ ఇదే… కంగారు పడతారా… పెడతారా..?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియాతో అడిలైడ్ ఓవల్‌లో భారత్ తలపడనుంది. ఫస్ట్ టెస్ట్ లో ఘన విజయం సాధించిన భారత్ రెండో టెస్ట్ లో ఎంత వరకు రాణిస్తుంది అనేది క్లారిటీ లేదు. భారత్ కు డే అండ్ నైట్ టెస్ట్ లు ఆడిన అనుభవం చాలా తక్కువ. కేవలం ఇప్పటి వరకు ఈ ఫార్మట్ లో పింక్ బాల్ తో 4 మ్యాచ్ లు మాత్రమే ఆడింది. 2020లో ఇదే వేదికపై చివరి డే అండ్ నైట్ టెస్ట్ ఆడింది. ఈ గ్రౌండ్ లో భారత్ కు రెండో డే-నైట్ టెస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో ఇప్పుడు అభిమానులను భయం వెంటాడుతోంది.

Also Read : ప్లీజ్ రోహిత్… వాళ్ళు వచ్చేశారు… నీ కోసమే వెయిటింగ్ హిట్ మ్యాన్

ఇండియా మొదటి పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్ 2019లో బంగ్లాదేశ్‌తో జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఇండియా సునాయాసంగా గెలిచింది. ఇప్పటివరకు భారత్ నాలుగు పింక్ బాల్ టెస్టులు ఆడింది. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత, 2021లో స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలంకను ఓడించింది భారత్. 2020లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టెస్టు చరిత్రలో ఇండియా అత్యల్ప స్కోరు, 36 పరుగులకు ఆలౌట్ కావడం పింక్ బాల్ టెస్ట్ లోనే నమోదు కావడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది.

పింక్-బాల్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది విరాట్ కోహ్లి. కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల్లో 277 పరుగులతో పింక్-బాల్ టెస్ట్ లో టాప్ స్కోరర్‌ గా నిలిచాడు. పింక్-బాల్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళ లిస్టు చూస్తే… విరాట్ కోహ్లీ: 4 మ్యాచ్‌ల్లో 46.16 సగటుతో 277 పరుగులు, రోహిత్ శర్మ : 3 మ్యాచ్‌ల్లో 43.25 సగటుతో 173 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ : 1 మ్యాచ్‌లో 79.50 సగటుతో 159 పరుగులు చేసారు. ఈ మ్యాచ్ లో కోహ్లీపైనే భారత్ ఆధారపడుతోంది. కోహ్లీకి పింక్ బాల్ టెస్ట్ లో ఓ సెంచరీ కూడా ఉంది.

Also Read : మరో ఐపిఎస్ కు మూడింది

పింక్-బాల్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ళ జాబితా చూస్తే… రవిచంద్రన్ అశ్విన్ పింక్ బాల్ టెస్టుల్లో భారత్ తరఫున 18 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ డే-నైట్ టెస్టుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. పింక్-బాల్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు టేకర్ల లిస్టు చూస్తే… రవిచంద్రన్ అశ్విన్: 4 మ్యాచ్‌ల్లో 13.83 సగటుతో 18 వికెట్లు, అక్షర్ పటేల్: 2 మ్యాచ్‌ల్లో 9.14 సగటుతో 14 వికెట్లు, ఉమేష్ యాదవ్: 2 మ్యాచ్‌ల్లో 15.54 సగటుతో 11 వికెట్లు తీసారు. మరి కంగారులను కంగారు పెడతారా… పడతారా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్