Friday, September 12, 2025 03:25 PM
Friday, September 12, 2025 03:25 PM
roots

ఇదెక్కడి మిడిల్ ఆర్డర్ రా బాబూ…

ప్రపంచంలోనే అత్యంత బలమైన టెస్ట్ జట్టు… టీం ఇండియాపై ఉన్న అంచనాలు ఇవి. కానీ అసలు సినిమా చూస్తే మాత్రం డిజాస్టర్. బెంగళూరు టెస్ట్ లో టీం ఇండియా మిడిల్ ఆర్డర్ చూస్తే ఈ టీం తోనే ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తారా అనే అనుమానాలు వచ్చాయి. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల, రవీంద్ర జడేజా సహా కీలక ఆటగాళ్ళు అందరూ మొదటి టెస్ట్ లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. టీం దూకుడుగా ఆడాల్సిన టైం లో స్లోగా ఆడటం స్లోగా ఆడాల్సిన టైంలో దూకుడుగా ఆడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక రెండో టెస్ట్ లో కూడా ఇదే సీన్ కనపడుతోంది. యువ, కీలక ఆటగాళ్ళు కూడా స్పిన్ పిచ్ పై నిలబడలేక సతమతం అవుతున్నారు. ఓపెనర్లలో జైస్వాల్ ఏదో కాస్త పర్వాలేదు అనిపించినా రోహిత్ ఫెయిల్ అయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ, మొదటి టెస్ట్ సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్ దారుణంగా ఫ్లాప్ అయ్యారు. ఆదుకుంటాడు అనుకున్న పంత్ కూడా ఆదుకోలేదు. ఇక అశ్విన్, జడేజా పెద్దగా ఆకట్టుకోలేదు. సుందర్ 20 పరుగులు చేసి కాస్త అంతరాన్ని తగ్గించినా… బూమ్రా అవుట్ కావడంతో అతనికి బ్యాటింగ్ ఛాన్స్ మిస్ అయింది.

Also Read : ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకి ఆ ఇద్దరు పేసర్లే దిక్కా?

బూమ్రా కాసేపు వికెట్ కాపాడుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొన్ని పరుగులు సుందర్ నుంచి వచ్చేవి. కాని సీన్ మారిపోవడంతో భారత్ ఆల్ అవుట్ అయింది. మిడిల్ ఆర్డర్ లో వికెట్ కాపాడుకుని ఆడే ఆటగాళ్ళు జట్టులో కనపడటం లేదు. పుజారా, రహానే మాదిరిగా ఆదుకునే ఆటగాళ్ళు లేరు. దీనితో ఆస్ట్రేలియా పర్యటనకు పుజారా, రహానే ని తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని, యువ ఆటగాళ్లను నమ్ముకుని టూర్ కు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. టి20 తరహా ఆట తీరుతో టెస్ట్ లు ఆడితే పరువు పోతుందని, న్యూజిలాండ్ కోసం తయారు చేసిన పిచ్ పై ఇండియా బోల్తా పడటం ఏంటీ అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్