Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

సీఎం గారి సమోసా ఏమైంది…?

సమోసా కోసం ఇప్పుడు సీఐడీ విచారణకు ఆదేశించారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును… మీరు చదువుతున్నది నిజమే… జస్ట్‌ ఓ సమోసా కోసం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం తినాల్సిన సమోసాను దొంగతనం చేశారంట… సమోసా సీఎంకు పెట్టకుండా ముందే తినేశారంట… ఇదే ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌.

Also Read : కేతిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్…?

అక్టోబర్‌ 21వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సుక్కి సైబర్‌ వింగ్‌ స్టేషన్‌ క్వార్టర్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమం మొత్తం సజావుగా సాగింది. ఎలాంటి ఆటంకం కలగలేదు. చివరి వరకు హమ్మయ్య అనుకున్నారు కూడా అయితే కార్యక్రమం జరుగుతున్నప్పుడు సీఎం సుఖ్విందర్‌ సుక్కికి మర్యాదపూర్వకంగా సమోసాలు ఇవ్వాలని అధికారులు భావించారు. సభ ముగిసిన తర్వాత సీఎం గారు వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో సార్‌… స్నాక్స్‌ వస్తున్నాయి… ప్లీజ్‌ సార్‌ అని అనేశారు. సరే అధికారుల మాట ఎందుకు కాదనాలని సీఎం కూడా కాసేపు ఆగారు. అయితే అనుకున్న సమయానికి సీఎంకు అందాల్సిన సమోసాలు రాలేదు. కాసేపు ఎదురు చూసిన సీఎం… జస్ట్‌ టీ తాగి సైలెంట్‌గా వెళ్లిపోయారు.

Also Read : పాపం పండుతోంది… సోషల్ మీడియా తిత్తి తీస్తున్నారా..?

సీఎం సుఖ్విందర్‌ సుక్కికి అందాల్సిన సమోసాలు ఏమయ్యాయని అధికారులు కలవరపడ్డారు. ఫైవ్‌ స్టార్ హోటల్‌ నుంచి తీసుకువచ్చిన సమోసాలు సీఎంకు ఎందుకు ఇవ్వలేదు అని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఐడీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించారు సీఐడీ బాస్‌. సీఎంకు సమోసాలు ఎందుకు అందలేదో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నుంచి తీసుకువచ్చిన సమోసాలను భద్రతా సిబ్బంది తినేసినట్లు విచారణలో వెల్లడైంది. కేవలం సమన్వయ లోపం కారణంగానే సీఎంకు సమోసాలు అందించలేకపోయారని తేల్చేశారు. అయితే ఇప్పుడు ఇదే అంశం హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ విమర్శలకు తెర లేపింది. సమోసాపై సీఐడీ విచారణ ఏంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనికి సీఎం వివరణ ఇవ్వాలని నిలదీస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్