Saturday, September 13, 2025 09:07 AM
Saturday, September 13, 2025 09:07 AM
roots

మావ పాలన మరిచిన అల్లుడు.. సభ నిర్వహణపై పెద్ద పెద్ద మాటలు

తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఎస్సి సమావేశం నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు కాస్త ఘాటుగానే మాట్లాడారు. కనీసం 15 రోజులు సభ నడపాలని డిమాండ్ కూడా చేశారు. ఇక బిఎసి అంటే బిస్కెట్ అండ్ చాయి సమావేశం కాదని ఎన్ని రోజులు సభను నడుపుతారో చెప్పకపోవడంతో బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేసి వచ్చేసాము అంటూ మాట్లాడారు. అలాగే రైతులకు బేడీలు వేసిన అంశం తమకు చాలా కీలకమని దీనిపై చర్చ జరగాలి అంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు.

Also Read : తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల పంచాయితీ..!

ఇక ఒక రోజు ప్రభుత్వానికి మరొక రోజు విపక్షానికి సభ ఇవ్వకపోవడం దారుణమని, సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ డిమాండ్ చేయడం గమనార్హం. ఈ మాటలు విన్న మీడియా వాళ్ళు ఒక్కసారిగా కంగు తిన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ప్రజలు, పరిశీలకులు… ఒక్కసారి గతంలో జరిగిన పరిణామాలు చూస్తే… 2015 అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఎస్సీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నాయని… కేసీఆర్ బీఎస్సీ సమావేశంలోనే అసహనం వ్యక్తం చేసారు.

ఆ తర్వాత అసలు బిఏసి సమావేశంలో గాని శాసనసభలో గాని తనకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆ రెండు పార్టీల శాసనసభ పక్షాలను తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఖమ్మం లో రైతులకు బేడీలు వేసిన అంశం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే సభలోకి కూడా రానీయకుండా మార్చల్స్ పెట్టి బయట గెంటేశారు. ప్రజా సమస్యల గురించి అప్పటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నిస్తే వారిని అసెంబ్లీ బయట ఎండలో నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.

Also Read : వైసీపీ నేతలను గుండెల్లో పెట్టుకున్న టీడీపీ 

దీనిపై చాన్నాళ్లపాటు కేసీఆర్ సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత తెలివిగా రైతులకు బేడీలు వేసే మొగోడు ఎవడు అంటూ కాస్త ఘాటుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక అప్పట్లో జరిగిన బిఎసి సమావేశాలపై ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మల్లు బట్టి విక్రమార్క కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కనీసం బీఎస్సీ సమావేశంలో విపక్ష పార్టీల అభిప్రాయం కూడా తీసుకోవడం లేదని సభలో చర్చించాల్సిన అంశాల గురించి తమ అభిప్రాయాలు చెబుతున్నా కనీసం లెక్క చేయడం లేదంటూ అప్పట్లో మల్లు బట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఇక సభలో ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం లేదంటూ హరీష్ రావు తాజాగా ఒక కామెంట్ చేశారు. అప్పట్లో ప్రతిపక్షాలు సమయం కోసం అడుగుతుంటే మైకులు కట్ చేసిన పరిస్థితి ఎన్నో సందర్భాల్లో ఉంది. కనీసం స్పీకర్లు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి కూడా వినే ప్రయత్నం అప్పట్లో చేయలేదు. బీఏసీ చెప్పినట్టే సభ నడుస్తుందని హరీష్ రావు మరో కామెంట్ చేశారు. గతంలో కేసీఆర్ ఏది అనుకుంటే అది… ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తే అప్పుడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉండేది.

Also Read : ఆస్ట్రేలియా పిచ్ లపై “హ్యాండ్సం బ్యాటింగ్” కెఎల్ రాహుల్ టెక్నిక్ కు ఫ్యాన్స్ ఫిదా

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ఆ తర్వాత మరో ఒకటి రెండు రోజుల కేసీఆర్ వచ్చేవారు. వివిధ కారణాలతో ఆయన సమావేశానికి కూడా హాజరైన పరిస్థితి ఉండేది. ఎక్కడికి పర్యటనలు ఉండేవి కాదు, కేబినేట్ సమావేశాలు ఉండేవి కాదు. సమీక్షల పేరుతో అధికారులను ప్రగతి భవన్ కు పిలిచేవారు. సమీక్ష అయిన తర్వాత జరిగింది అంటూ మీడియాకు ఒక వార్త చెప్పేవారు. ఇప్పుడు మావ పరిపాలనలో అన్నీ దగ్గర ఉండి చూసుకున్న… హరీష్ రావు గతం మరిచిపోయి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్