Tuesday, October 28, 2025 05:37 AM
Tuesday, October 28, 2025 05:37 AM
roots

టీడీపీ సోషల్ మీడియాకు గుర్రంపాటి బెదిరింపులు

వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది ముందుండి నడిపించారు. అందులో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ వంటి వాళ్లు అత్యంత కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాలను వీరు అమలు చేసేవారు. వీరికి ప్రభుత్వ పరంగా కూడా జీతం అందేది. వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని పోస్టులను సృష్టించి వాటి ద్వారా జీతాలను అధికారికంగా చెల్లించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీకి అనుకూలంగా అప్పట్లో వీరు చేసిన సోషల్ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు.

Also Read : అమరావతిపై ద్వేషం.. వైసీపీని మించిన బీఆర్ఎస్

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చాలామంది ఎదురు చూశారు. ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్రారెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కచ్చితంగా ఊచలు లెక్కపెట్టడం ఖాయం అని భావించారు. కానీ వీరిలో ఇంటూరి రవి కిరణ్ మాత్రమే అరెస్టయ్యారు. ఇక గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అప్పట్లో టిడిపి అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అతని విషయంలో మాత్రం ఏ చర్యలు తీసుకోలేదు. ఇక టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతనిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూనే ఉన్నారు.

Also Read : జగన్ ధనదాహానికి దేవుడిచ్చిన అన్న బలి..!

ఇప్పుడు సోషల్ మీడియాలో టిడిపిలో యాక్టివ్ గా ఉండే కొంతమంది కార్యకర్తలను డైరెక్ట్ గానే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. టిడిపి కి అనుకూలంగా మాట్లాడుతూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే కొంతమంది కార్యకర్తలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో బెదిరించడం ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో టిడిపి అగ్ర నేతలపై వ్యక్తిగత విమర్శలు చేసినా సరే.. లోకేష్ ను అత్యంత దారుణంగా మాట్లాడిన సరే అతన్ని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. తను ఎవరు ఏం చేయలేరు అనుకున్నారు ఏమోగానీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మాత్రం మళ్ళీ సోషల్ మీడియాలో క్రమంగా ఆక్టివేట్ అవుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గతంలో వైసిపి ఏ విధంగా విమర్శలు చేసిందో ఇప్పుడు అదే స్థాయిలో విమర్శలు చేసే దిశగా పార్టీ కార్యకర్తలకు ధైర్యం నింపుతున్నారు మరి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి విషయంలో పోలీసుల చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్