తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొన్నాళ్ళుగా తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయంగా ఈ అంశంపై సిఎం రేవంత్ రెడ్డి గతంలో తీవ్ర ఆరోపణలే చేసారు. అప్పటి మంత్రి కేటిఆర్, అధికారులు కొందరిపై ఆయన తీవ్ర విమర్శలు చేసారు. ఇక ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ప్రస్తుతం అమెరికా పారిపోయారు. ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు కూడా పొందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ వ్యవహారంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
Also Read : అవినాష్ రెడ్డి ని అడ్డంగా బుక్ చేసిన విసారెడ్డి
నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించారు. విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనరెడ్డి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ పర్యవేక్షిస్తూ ఉంటారు. పీఏను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఇంద్రసేన రెడ్డి ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : విసారెడ్డి రాజీనామా పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయిలో ఈ వ్యవహారంలో విచారణ జరిపిన తర్వాత మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్ మ్యాన్‌లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాధమిక అంచనాకు వచ్చారు. అలాగే ఏపీకి చెందిన కొందరు కీలక నాయకుల ఫోన్ లను కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం.