Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

ఐఏఎస్ అయిన ఐటీ ఎంప్లాయ్.. గూగుల్ లో జాబ్ వదిలేసి మరీ…!

UPSC సివిల్ సర్వీస్ పరీక్ష (CSE)ల్లో విజయం సాధించడం అంత తేలిక కాదు. ప్రతి సంవత్సరం వేలాది మంది ఆశావహులు ఈ పరీక్ష రాస్తూనే ఉంటారు. ఎలాగైనా సరే ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉద్యోగాలు సంపాదించాలి అనుకునే వారు నిత్యం కష్టపడుతూనే ఉంటారు. అయినప్పటికీ కొంతమంది మూడు క్లిష్టమైన దశలైన – ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూల కోసం తపిస్తూనే ఉంటారు. ఇందుకోసం కొందరు పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకునే వాళ్ళు కూడా ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కష్టపడే వాళ్ళు ఉన్నారు.

Also Read : మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్

తాజాగా అనుదీప్ దురిశెట్టి అనే ఒక ఐఏఎస్ ఇదే కోవలోకి వస్తారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అనుదీప్ దురిశెట్టి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి.. ఐఏఎస్ కావాలనే తపనతో కష్టపడ్డారు. 2011లో రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీ నుండి ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బి.టెక్ పట్టా పొందిన అనుదీప్.. గూగుల్‌లో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యాడు. అయినా సరే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటైన యూపీఎస్ లో ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా.. కేవలం ఆన్లైన్ పై ఆధారపడి.. ఐఏఎస్ గా ఎంపికయ్యారు అనుదీప్.

Also Read : ఎన్టీఆర్ పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

2012లో మొదటిసారి పరీక్ష రాసిన అనుదీప్.. మొదటి సారి ఐఏఎస్ కాలేకపోయారు. అయినా సరే పట్టుదలగా కష్టపడ్డారు. 2013 లో మళ్ళీ పరీక్ష రాసి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో విజయవంతంగా ఉద్యోగం సంపాదించారు. అక్కడ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన ఆయన.. అక్కడితో ఆగకుండా.. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో కష్టపడి.. అతని 2014, 2015, 2016 పరీక్షలు రాసారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా.. 2017 లో చివరిసారి పరీక్ష రాసారు. ఐదవసారి సివిల్ సర్వీస్ పరీక్ష హాజరై.. ఎయిర్ 1 తో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్