వైసీపీ అధికారాన్ని చూసుకుని వెనుకా ముందు ఆలోచన లేకుండా రెచ్చిపోయిన వారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెంటాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వైసీపీ నేతల అనుచరులుగా చెలామణి అవుతూ టీడీపీ నేతలపై దాడులు చేసిన వారిపై కూడా వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరో కేసు బయటకు లాగారు.
Also Read : జగన్ నిర్ణయంతో కంగారులో వైసీపీ నాయకులు
నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. వాహనంపై అభివాదం చేస్తూ చంద్రబాబు వస్తుండగా వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో ఘటన చోటు చేసుకుంది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు గాయాలు అయ్యాయి. దీనిపై అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది వైసీపీ నాయకుల పనే అన్న విషయం అప్పుడే అందరూ మాట్లాడుకున్నారు. అయితే నాటి వైసీపీ సర్కార్ ఈ విషయాన్ని దర్యాప్తు చేయకుండా పక్కన పెట్టేసింది.
Also Read : రాంగోపాల్ వర్మ అరెస్ట్ కి సర్వం సిద్దం
దీనిపై కేసు నమోదైనా వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని పలుమార్లు టీడీపీ నేతలు ఆరోపించారు. తాజాగా పోలీసులు కేస్ నీ బయటికి తీసి విచారణ మొదలుపెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు.. ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాత్ర పై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అదుపులో ఉన్న నిందితులు కూడా ఈ కుట్రలో భాగం పంచుకున్న అందరి పేర్లు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీంతో వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైందని తెలుస్తుంది.