Tuesday, October 28, 2025 04:48 AM
Tuesday, October 28, 2025 04:48 AM
roots

జీర్ణ సమస్యలు ఉన్నాయా..? ఈ 5 తింటే చాలు

ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలే మనకు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారుతూ ఇబ్బంది పెడుతున్నాయి. ఉబ్బరం, అజీర్ణం, ఆమ్లత్వం, భోజనం తర్వాత బరువుగా అనిపించడం అనేవి మనకు నిత్యం ఉండే ఇబ్బందులు. రుచికరమైన భోజనం తిన్న వెంటనే, పొట్ట ఉబ్బరంగా ఉండటం, యాక్టివ్ గా లేకపోవడం వంటివి సాధారణంగా ఉండే సమస్యలు. ఈ సమస్యలను ముందుగానే అర్ధం చేసుకుని జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో అవే ప్రాణం తీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

సరిగా నిద్ర విషయంలో క్రమ శిక్షణ పాటించకప్వడంతో పాటుగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్ తీసుకోవడం, రోజువారీ భోజనానికి సరైన క్రమ శిక్షణ లేకపోవడం జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రధాన కారణాలు. ఈ సమస్యలను అధిగమించడానికి కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. ప్రతీ రోజు సహజంగా దొరికే 5 ఆహార పదార్ధాలు తినడం మంచిదట.

Also Read : పొగాకు రైతులకు 24 గంటల్లోనే.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

పైనాపిల్ – ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనితో జీర్ణం కాని ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

కివి – ఈ పండులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మాంసం & పాల ఉత్పత్తుల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

బొప్పాయి – పపైన్ అనే ఎంజైమ్‌తో నిండిన బొప్పాయి భోజనం తర్వాత ప్రోటీన్ ను బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

తేనె – దీనిలో అమైలేస్, ప్రోటీజ్ వంటి ఎంజైమ్‌ లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ప్రక్రియలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

అల్లం – ఇందులో జింగిబైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రోటీన్ జీర్ణక్రియ, పోషకాలను శరీరం తీసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్