Friday, September 12, 2025 07:06 PM
Friday, September 12, 2025 07:06 PM
roots

జగన్‌కు ఈడీ బిగ్ షాక్..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకున్ని అడ్డగోలుగా దోచుకున్న సొమ్మును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. ఒకటి కాదు రెండు కాదు… 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో ఏకంగా 800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేసింది. క్విడ్ ప్రో కో కింది జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కంపెనీలకు లాభాలు కలిగించారని… అందుకు బదులుగా వ్యాపార సంస్థల నుంచి పెద్ద ఎత్తున లాభాలు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్‌పై సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో ఈడీ కూడా జగన్‌పై విచారణ జరిపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని.. ఇందుకు బదులుగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు జరిపినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

Also Read : విజయసాయి తర్వాత మిథున్ రెడ్డి.. వెంటాడుతున్న సిట్ 

ఈ కేసు విచారణలో భాగంగా జగన్‌ను 2012 మే 27న సీబీఐ అరెస్టు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సుమారు 58 కంపెనీలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. ఈ సంస్థలతో పాటు జగన్‌కు కూడా ఈడీ, సీబీఐ సమస్లు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మూడు రోజుల పాటు విచారించిన సీబీఐ.. విచారణకు సహకరించటం లేదనే కారణంతో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. కేసు విచారణ కొనసాగుతుండగా.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు కూడా. దీంతో సుమారు 16 నెలల పాటు చంచల్‌గూడ జైలులో జగన్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Also Read : ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు.. బయటకు వస్తారా..?

2013 నుంచి జగన్ బెయిల్ పైనే ఉన్నారు. 2019 వరకు ప్రతి శుక్రవారం వాయిదా కోసం సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు కూడా. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వారం కుదరదని.. భద్రతా కారణాల దృష్ట్యా ఒక్కసారికి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు కోర్టు వాయిదాలకు జగన్ హాజరు కావటం లేదు. అయితే ఈ కేసు విచారణపై ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న సమయంలోనే రోజు వారీ విచారణ జరిపించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచింది. తాజాగా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీల్లో ఉన్న వాటాలు, షేర్లను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతం కంటే.. ఎక్కువగా ఆయన కుటుంబం, సంబంధిత కంపెనీలు, సహచరుల పేరుతోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Also Read : మాజీ మంత్రిపై అధినేత సీరియస్..!

ఒక్కరోజు ముందే జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ 793 కోట్ల రూపాయలు. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకు ఇచ్చింది. ఈ లీజు కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని అప్పట్లోనే సీబీఐ ఆరోపించింది. జగన్‌తో కలిసి దాల్మియా సిమెంట్స్ సంస్థ సున్నపురాయి గనుల లీజులను అక్రమంగా పొందినట్లు 2013లోనే దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో సీబీఐ స్పష్టం చేసింది. దీని ద్వారా జగన్‌కు సుమారుగా 150 కోట్ల మేర అక్రమంగా లబ్ది జరిగినట్లు కూడా సీబీఐ స్పష్టం చేసింది. రఘురామ్ సిమెంట్స్‌లో 95 కోట్ల విలువైన షేర్లు, అలాగే 55 కోట్ల రూపాయలను హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. సీబీఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ.. తాజాగా 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్