విదేశాల్లో గతంలో మాదిరిగా పరిస్థితులు లేవు అనే మాట వాస్తవం. గతంలో పార్ట్ టైం ఉద్యోగాలలో డబ్బులు సంపాదించుకోవచ్చు అనే లక్ష్యంతో విదేశాలకు వెళ్ళిన ఎందరో విద్యార్ధులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అంతే కాక వలసదారులకు శాశ్వత నివాసం కోసం వేచి ఉండే కాలాన్ని 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పొడిగించడం ద్వారా వలస నియమాలను కఠినతరం చేయాలని UK ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా యూకే, అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉన్న మాట ఎవరూ కాదనలేరు. లక్షలు అప్పు చేసి వెళ్ళిన ఎందరో విద్యార్ధులు రోడ్డున పడే పరిస్థితి ఆయా దేశాల్లో ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో క్లిష్ట పరిస్థితి మొదలైంది.
Also Read : పట్టు బిగిస్తున్న కాంగ్రెస్.. మోడీ దొరికిపోయారా..?
ఇక తాజాగా యూకే లో ఉంటున్న ఓ మహిళ.. భారత విద్యార్ధులకు సంచలన సూచనలు చేసారు. లండన్ లో నివాసం ఉంటున్న ఆమె.. యూకేలో మాస్టర్స్ చేయడానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్ధులు జాగ్రత్తగా ఉండాలని, అసలు యూకే రాకుండా ఉండటం మంచిదని హెచ్చరించారు. అక్కడ నిబంధనలు, మార్కెట్ డల్ గా ఉండటం వంటి కారణాలతో చాలా మందికి ఉద్యోగాలు దొరకడం లేదని, కాబట్టి అసలు ఆ దేశానికి రావొద్దని హెచ్చరించారు. నిరుద్యోగులుగా తిరిగి వారి వారి దేశాలకు వెళ్లిపోతున్నారని హెచ్చరించారు ఆమె.
Also Read : వంశీ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు
భారత్ లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం యూకే వెళ్ళిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ జాన్హవి జైన్, ఎక్స్ లో ఓ పోస్ట్ చేసారు. తన బ్యాచ్‌మేట్స్‌లో దాదాపు 90% మంది ఉద్యోగం సాధించడంలో ఫెయుల్ అయ్యారని పేర్కొన్నారు. తాను ఉద్యోగం సంపాదించినా.. అది చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. గతంలో, దాదాపు 60-70% అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాలు పొందగలిగారు. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం అసలు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.




