Friday, August 29, 2025 09:33 PM
Friday, August 29, 2025 09:33 PM
roots

ట్రంప్ దెబ్బకు తమిళనాడులో ఆ నగరం ఖాళీ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు భారత్ కు తలనొప్పిగా మారడం ఖాయంగా కనపడుతోంది. నేటి నుంచి అమలులోకి వచ్చిన 50 శాతం సుంకాల నిర్ణయం ప్రభావం ఎన్నో రంగాలపై పడుతోంది. కీలక రంగాలైన సముద్ర ఉత్పత్తులు, జౌళి పరిశ్రమ, ఆటో మొబైల్ విడి భాగాలు ఇలా పలు రంగాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తమిళనాడులోని తిర్పూర్ నుంచి దాదాపు 30 శాతం ఎగుమతులు అమెరికాకే వెళ్తాయి. ఇప్పుడు వాటి ధరలు అమెరికాలో పెరిగే అవకాశం ఉంది.

Also Read : రెండు పెన్షన్లు.. చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో అమెరికాకు 86.5 బిలియన్ డాలర్ల వస్తువులు, సేవలను భారత్ ఎగుమతి చేసింది. భారత్ మరో దేశానికి ఈ స్థాయిలో ఎగుమతి చేయలేదు. దీనిపై భారత ఎగుమతుల సమాఖ్య కీలక ప్రకటన చేసింది. వాటిలో రెండు వంతులు ట్రంప్ సుంకాల కారణంగా ప్రభావితం అవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా, 48 బిలియన్ డాలర్లు విలువ చేసే ఎగుమతులు ఇప్పుడు 35 శాతం ధరల ప్రతికూలతను ఎదుర్కొంటాయని తెలిపింది. దీనిని వియత్నాం, బంగ్లాదేశ్, చైనా నుండి వచ్చిన వ్యాపారులు వినియోగించుకుంటారు అని పేర్కొంది.

Also Read : మంత్రులకు ర్యాంకులు కరెక్టేనా..? వద్దంటున్న కార్యకర్తలు

తమిళనాడులోని తిరుపూర్ లో వస్త్ర కేంద్రాలలో ఉత్పత్తి ఇప్పటికే ఆగిపోయిందని సంచలన విషయాలు వెల్లడించింది. అక్కడ చాలా వీధుల్లో వస్త్ర తయారి పరిశ్రమలు మూసివేసి, అక్కడ పని చేసే వారిని కూడా వెనక్కు పంపారని తెలిపింది. 40 శాతం అమ్మకాలకు అమెరికన్ మార్కెట్‌పై ఆధారపడే రొయ్యల ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. రుణ చెల్లింపులను 12 నెలల పాటు నిలిపివేయడం, ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం పెంచడం వంటి ఉపశమనం కల్పించాలని కేంద్రానికి సూచించింది. భారతదేశ ఎగుమతుల్లో 30 శాతం వరకు సుంకం లేకుండానే ఉంటాయి. మిగిలిన 66 శాతంలో వస్త్ర, రత్నాలు, రొయ్యలు మరియు ఫర్నిచర్ పరిశ్రమలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్