తెలంగాణా రాజకీయాలతో పాటు సినిమా పరిశ్రమలో కూడా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఏ మలుపు తిరుగుతాయో తెలియదు గాని, రాజకీయంగా పెద్ద రచ్చె జరుగుతోంది. ఇక సినిమా వాళ్ళు కూడా ఒక్కొక్కరు స్పందిస్తూ కొండా సురేఖ మాటలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారని, దాని వెనుక కేటిఆర్ ఉన్నారనే కోపంలో మంత్రి కొండా సురేఖ నోటికి పని చెప్పారు. అది కాస్త హద్దులు మీరడంతో ఒక్కసారిగా సంచలనం అయింది.
అయితే ఇది ఖచ్చితంగా రాజకీయ వ్యూహమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవలి కాలంలో తెలంగాణాలో హైడ్రా పెద్ద సంచలనమే అవుతోంది. హైడ్రా విషయంలో క్రమంగా హైదరాబాద్ వాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక మూసి నది సుందరీకరణ ప్రాజెక్ట్ విషయంలో కూడా బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది. ఇక మీడియాలో కూడా దీనిపై పెద్ద హడావుడే జరుగుతోంది. ఇది క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీసే అవకాశం ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలెర్ట్ అయింది అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Read Also : బ్రేకింగ్: కొండా సురేఖ గారు అర్ధం చేసుకోండి: సమంతా
అందుకే ఇప్పుడు మీడియాను డైవర్ట్ చేయడానికి కొండా సురేఖను ప్రయోగించి ఉండవచ్చు అంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖ చేసినవి సాధారణ వ్యాఖ్యలు కాదు. అందుకే మీడియా మొత్తం ఇప్పుడు ఆమె కామెంట్స్ పైనే ఫోకస్ పెట్టింది. సినిమా వాళ్ళు చాలా మంది ఈ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇక ఆమెకు కేటిఆర్ లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఇక తాను చేసిన వ్యాఖ్యలపై సమంతా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మొత్తం మీద సురేఖ వ్యాఖ్యలతో హైడ్రా వ్యతిరేకత మరియు బాధితుల ఆందోళన మీడియాలో ఎక్కడ కనపడకుండా పోయింది. కాంగ్రెస్ కి కావాల్సింది కూడా ఇదే.