Saturday, September 13, 2025 01:34 AM
Saturday, September 13, 2025 01:34 AM
roots

బీజేపీలో వేరు కుంపట్లు.. ఎవరి గ్రూప్ వారిదే..!

దక్షిణ భారతంలో నిలదొక్కుకోవాలనేది భారతీయ జనతా పార్టీ పెద్దల ఆలోచన. ఇందుకోసం అవకాశం ఉన్న అన్ని మార్గాలను వాడేస్తున్నారు. కానీ తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచినట్లుగా పరిస్థితి మారిపోయింది. అగ్రనేతల ఆలోచనకు పూర్తి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల నేతలు వ్యవహరిస్తున్నారు. అంతా కలిసికట్టుగా ముందుకు పోవాలనేది కమలం పార్టీ నేతలకు ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. ఎవరో చెబితే నేను వినేది ఏమిటీ అన్నట్లుగా.. తమకు నచ్చినట్లుగా పాలిట్రిక్స్ చేస్తున్నారు.

Also Read : రెబల్ ఫ్యాన్స్ కు.. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఫెస్టివల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం బలమైన నాయకత్వం తయారు చేసేందుకు ప్లాన్ చేస్తోంది కూడా. ఏపీలో కూటమి సర్కార్‌లో చేరినప్పటికీ.. పూర్తిస్థాయి ఆధిక్యం మాత్రం లేదు. 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలవటంతో ఆ పార్టీ గట్టిగా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఇదే సమయంలో బీజేపీలో నేతల మధ్య పూర్తిస్థాయిలో సమన్వయం లేదనేది వాస్తవం. కొందరు కేంద్ర పెద్దలకు దగ్గరగా.. మరికొందరు.. రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉండటం.. ఇంకొందరు ఆర్థికంగా బలంగా ఉండటం.. దీంతో ఎవరికి వారే అన్నట్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి కొనసాగుతున్నారు. ఆమెను తప్పించి.. ఆ బాధ్యతలు తనకు అప్పగించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అటు చాలారోజులుగా సైలెంట్‌గా ఉన్న విష్ణువర్థన్ రెడ్డి కూడా తనకే ఆ పదవి ఇవ్వాలని పెద్దలను కోరుతున్నారు.

Also Read : పెట్టుబడుల విషయంలో బాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?

వైసీపీ కోవర్టుగా ముద్రపడిన జీవీఎల్ నరసింహారావుకు రాజ్యసభ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని జీవీఎల్‌కు ఇస్తారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి జీవీఎల్ కాస్త సైలెంట్‌గా ఉన్నారు. మరో ఎంపీ సీఎం రమేష్ కూడా పార్టీలో అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన సీఎం రమేష్.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూడా పెద్ద లాబీయిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో సత్సంబంధాలున్న సీఎం రమేష్.. వాటిని తన రాజకీయాలకు ఉపయోగించుకుంటూ.. కీలక పదవులు పొందుతున్నారు. ఎంపీగా గెలిచి 9 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు సీఎం రమేష్ కన్నెత్తి కూడా చూడలేదు. మరో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా పార్టీలో కీలక పదవుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీరికి తోడు ఇప్పుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా తెర వెనుక రాజకీయం చేస్తున్నారు.

Also Read : భవిష్యత్తుపై కేటిఆర్ సంచలన ప్రకటన

ఇక అటు తెలంగాణలో కూడా బీజేపీలో గ్రూపుల లొల్లి పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజా సింగ్… ఇలా చెప్పుకుంటూ పోతే… జాబితా చాలా పెద్దగానే ఉంది. ఎవరికి వారు అంతా తామే సీనియర్లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చింది తమ వల్లే అనేది బండి సంజయ్ వర్గం మాట. అసలు పార్టీని నడిపిస్తుందే మేమే అంటారు కిషన్ రెడ్డి వర్గం. తమ వల్లే బీఆర్ఎస్‌ వీక్ అయ్యిందనేది ఈటల మాట. నెక్ట్స్ అధ్యక్షుడిని తానే అంటారు ధర్మపురి అర్వింద్.. ఇలా ఎవరికి వారే పాలిట్రిక్స్ చేయడంతో కమలం పార్టీలో గ్రూపుల గోల కిందిస్థాయి కార్యకర్తలకు కూడా అసహనం తెప్పిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్