Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

దేవినేని అభిమానుల్లో చీలిక.. అవినాష్ గతం మర్చిపోయారా…?

వల్లభనేని వంశీని అరెస్టు చేయడం ఏమో గాని కొన్ని పరిణామాలు మాత్రం కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్.. వల్లభనేని వంశీకి మద్దతుగా మాట్లాడడం చూసి దేవినేని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దేవినేని నెహ్రూ బతికున్న సమయంలో వంశీకి.. నెహ్రూకు మధ్య ఒకరకంగా యుద్ధ వాతావరణం నడిచింది. వాస్తవానికి కృష్ణాజిల్లాలో నెహ్రూకు ఎదురు తిరిగి మాట్లాడిన పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు.

Also Read : సానుభూతి కోసం జగన్ నయా స్కెచ్

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ నెహ్రూ పై పోరాటం చేశారు. ఇక అప్పట్లో విజయవాడ సి.పిగా ఉన్న సీతారామాంజనేయులు కూడా ఈ వ్యవహారంలో తలదూర్చారు. ఇక దేవినేని అవినాష్ విదేశాల్లో చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ కి ఎదురు పడటం.. ఆ తర్వాత కాస్త ఘర్షణ వాతావరణ చోటు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం జరిగాయి. అవినాష్ ను వంశీ వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. అలాంటి వంశీకి మద్దతుగా అవినాష్ కామెంట్స్ చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

Also Read : వైసీపీలో 14 రోజుల భయం.. వంశీ ఇప్పట్లో కష్టమే..?

ఈ విషయంలో వంగవీటి రాధా.. అవినాష్ కంటే బెటర్ అనే కామెంట్స్ కూడా రావడం గమనార్హం. వంగవీటి దేవినేని కుటుంబాల మధ్య దశాబ్దాల పాటు యుద్ధ వాతావరణం నడిచింది. తన తండ్రి మరణానికి దేవినేని నెహ్రూ కారణం అనే కోపంలో ఉన్న రాధా.. నెహ్రూను కలవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కాంగ్రెస్ లో ఉన్నా సరే ఒకే వేదికను పంచుకోవడానికి కూడా రాధా ఎప్పుడు ఇష్టపడలేదు. ఈ విషయంలో అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా అది సఫలం కాలేదు. అలాంటిది తన తండ్రిని తనను దారుణంగా విమర్శించిన వంశీకి మద్దతుగా అవినాష్ నిలబడటం చూసి దేవినేని అభిమానులు ఆశ్చర్యపోయారు. దీనిపై దేవినేని చందు సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో దేవినేని అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోవడం గమనార్హం

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్