రెండు రోజులుగా సోషల్ మీడియా మోత మోగిపోతోంది. ఇది చివరికి వ్యక్తిగత స్వేచ్ఛ వరకు ఈ చర్చ దారి తీసింది. ఇంతకూ ఈ చర్చ దేని గురించో తెలుసా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ గురించే. ఆమె చేశారంటే.. బీచ్‌లో చెత్త క్లీన్ చేశారు. బీచ్‌లో చెత్త క్లీన్ చేస్తే తప్పేంటి అంటే.. అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ.. ఆ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
Also Read : అనుకున్నది.. అనుకున్నట్లుగానే..!
అమృత ఫడ్నవీస్.. సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటారు. సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు. గతంలో ఆమె అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు కూడా. ఇటీవలే యోగా డే రోజున ఆమె యోగాసనాలు వేస్తూ అందరినీ ఆరోగ్యంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్య పరుస్తారు కూడా. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా కూడా ఉంటారు.
తాజాగా ముంబైలోని జుహు బీచ్‌లో అమృత క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. గణేష్ నిమజ్జనాలు ముగిసిన మరుసటి రోజు ఆమె బీచ్‌లో క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా అమృతతో చెయ్యి కలిపారు. బీచ్‌లో చెత్త క్లీన్ చేసిన తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించారు. ప్రజలంతా శుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. అంత వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అదే ఆమె వేసుకున్న డ్రెస్.
బీచ్ క్లీన్ కార్యక్రమంలో అమృత జిమ్ డ్రెస్‌లో కనిపించారు. ఆ తర్వాత సభలో కూడా అదే డ్రెస్‌తో పాల్గొన్నారు. ఈ విషయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. పది మందికి మంచి చెప్పాలనుకోవటం తప్పు కాదు.. కానీ ఇది చెప్పే విధానంలో లోపముంది అంటూ కామెంట్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్‌లో శరీర భాగాలు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రాల కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో చూడండి మేడం అని పోస్ట్ చేస్తున్నారు. మరి కొందరైతే.. ఇదేనా సనాతన ధర్మం అని బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
Also Read : రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఇవే లెక్కలు..
ఈ ప్రశ్నలకు కొందరు తమదైన శైలిలో జవాబిస్తున్నారు. నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని అమృతకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. మరికొందరైతే.. ఆమె వస్త్రాలు చూడొద్దు.. చేస్తున్న పనులను మాత్రమే చూడండి.. అని సూచిస్తున్నారు. మొత్తానికి సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్ వస్త్రధారణ ఇప్పుడు బీజేపీ అగ్రనేతలను కూడా ఇబ్బంది పెడుతోంది.




