Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

ఏపీ రాజకీయాలపై ఓ డైరెక్టర్ సెన్సేషనల్ స్టెప్

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వివాదాలు, సంచలనాలు, ప్రభుత్వాల రాజకీయ కక్ష సాధింపులు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. 2004 తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చాయి. రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి.. విమర్శలు చేసే పరిస్థితులు కూడా 2004 తర్వాతనే రాష్ట్రంలో కనిపించేవి. ఇక 2010లో వైసీపీ ఆవిర్భావం తర్వాత ఏపీ రాజకీయాల మలుపు వేరే రేంజ్ లో తిరిగిందని చెప్పాలి.

Also Read : ఆనాడు యరపతనేని ఒక్కడే నిలబడ్డాడు.. బాబు సంచలన కామెంట్స్

రాజకీయంగా బలపడటం కోసం వైఎస్ జగన్ చేసిన రాజకీయం దేశంలో బహుశా ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండకపోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు కూడా తన పందాను మార్చుకుని రాజకీయం చేసి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పరిణామాలు అన్నింటిని ఓ వెబ్ సిరీస్ లో చూపించేందుకు ఓ డైరెక్టర్ సిద్దమయ్యాడు. పవర్ ఫుల్ డైలాగ్స్, మాటలతో దుమ్మురేపే డైరెక్టర్ దేవా కట్టా ఇప్పుడు ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read : ఇంత జరుగుతున్నా తండ్రి కొడుకులు ఎక్కడా…?

2004 నుంచి ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను.. ఈ వెబ్ సిరీస్ లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కథ కూడా రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా దీనిని ప్లాన్ చేసేందుకు దేవా కట్ట రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే నటులను కూడా ఫైనల్ చేశారు. చంద్రబాబు పాత్రలో.. ఆది పినిశెట్టి అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో చైతన్య రావు నటిస్తారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే వైఎస్ జగన్ పాత్రలో నటించే నటుడి కోసం ప్రస్తుతం లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నాడు డైరెక్టర్. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేసి వెబ్ సిరీస్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్