Saturday, September 13, 2025 12:47 AM
Saturday, September 13, 2025 12:47 AM
roots

‘ఇండియా’ ఐక్యతకు తూట్లు..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డబుల్‌ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. మరో రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సింగల్‌గా పోటీ చేస్తుందని ప్రకటించారు అరవింద్‌ కేజ్రీవాల్‌. సామాన్యుడు ప్రారంభించిన పార్టీకి వరుసగా 3 విజయాలు అందించిన ఘనత కేజ్రీవాల్‌కు దక్కుతుంది.

Also Read : మెగా Vs అల్లు రచ్చ.. క్లారిటీ వచ్చేది నేడే..!

2012లో ప్రారంభమైన ఆప్‌… 2013 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తొలిసారి పోటీ చేసి గెలిచింది. అయితే అనూహ్యాంగా అసెంబ్లీ రద్దు చేసిన సీఎం కేజ్రీవాల్‌… 2015లో మరోసారి సింగిల్‌గా ఎన్నికల బరిలో పోటీ చేసి ఘన విజయం సాధించింది. ఇక 2020లో కేజ్రీవాల్‌ను ఓడించేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా కృషి చేసినప్పటికీ… ఓటర్లు మాత్రం ఆప్‌కే పట్టం కట్టారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 58 స్థానాల్లో విజయం సాధించగా… బీజేపీ కేవలం 7 మాత్రమే గెలిచింది.

పంజాబ్‌ ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి అధికారం చేపట్టిన ఆప్‌… ఆ తర్వాత హర్యాన ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఫలితం చూపించలేదు. అయితే తమకు కంచుకోటగా మారిన ఢిల్లీ పీఠాన్ని మరోసారి దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే కేజ్రీవాల్‌ పావులు కదుపుతున్నారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టు అయి సుమారు 4 నెలల పాటు తీహార్‌ జైలులో గడిపిన కేజ్రీవాల్‌.. బెయిల్‌పై బయటకు వచ్చారు. బెయిల్‌పై విడుదలైన వెంటనే.. సీఎం పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు కేజ్రీవాల్‌.

Also Read : హైకోర్టులో వర్మకి భారీ ఊరట

ప్రస్తుతం అతిషీ సింగ్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ… స్టీరింగ్‌ మాత్రం కేజ్రీవాల్‌ చేతుల్లోనే ఉందనేది బహిరంగ రహస్యం. మళ్లీ గెలిచిన తర్వాతే సీఎం కూర్చీలో కూర్చుంటా అంటూ కేజ్రీవాల్‌ శపథం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో టార్గెట్‌ బీజేపీ అన్నట్లుగా ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ దూకుడు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విపక్షాల ఐక్యత ఎక్కువ కాలం నిలువలేదు అన్న సంగతి అర్ధం అవుతుంది. విపక్ష ఇండియా కూటమి అనైక్యతే మోడీకి వరంలా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్