Friday, September 12, 2025 03:20 PM
Friday, September 12, 2025 03:20 PM
roots

ఏపీ పాలిటిక్స్ లో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో ఏపీ పాలిటిక్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయనేది వాస్తవం. పేరుకు రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ రాజకీయాల విషయంలో మాత్రం ఏపీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. అదే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే మాట బాగా వినిపిస్తోంది. వాస్తవానికి ఈ మాట ఎన్నికల ముందే వినిపించినప్పటికీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఈ ప్రతిపాదన ఏకంగా సీఎం చంద్రబాబు ఎదురుగానే పార్టీ నేతలు చేయడంతో మరోసారి ఆసక్తిగా మారింది.

Also Read : బాలయ్య సినిమాపై కుట్ర…? థియేటర్లు కావాలనే తగ్గించారా…?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారని ఎన్నికల ముందే జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. కూటమి గెలుపు తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అలాగే లోకేష్ పదవిపై కూడా తేల్చేశారు చంద్రబాబు. మంత్రిగా, పార్టీ కార్యదర్శిగా లోకేష్ సమర్ధవంతంగా పని చేస్తున్నారు. ఇక సభ్యత్వాల నమోదులో టీడీపీ రికార్డు నమోదు చేసింది. ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీకి లేనట్లుగా టీడీపీ సభ్యత్వాలు ఏకంగా కోటి దాటేశాయి. ఇందులో నారా లోకేష్ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ఇదే అంశాన్ని పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు పర్యటనలో టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు ఎదురుగానే ప్రతిపాదన చేశారు. దీనికి పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఇతర ముఖ్య నేతలు కూడా ఇప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వంటి సీనియర్ నేతలు కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి కూడా లాభం ఉంటుందన్నారు.

Also Read : అమెరికాలో రెచ్చిపోతున్న టిక్ టాక్.. సుప్రీం కోర్ట్ షాక్…!

వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కేటీఆర్ సీఎం అంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే వీటికి నాటి సీఎం కేసీఆర్ స్వయంగా చెక్ పెట్టారు. మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు కూడా. కానీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయటం ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్