Friday, September 12, 2025 04:39 PM
Friday, September 12, 2025 04:39 PM
roots

ఈరోజు (26-07-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసం, వర్షఋతువు, దక్షిణాయనం ద్వాదశ రాశిలో ఏ రాశులకు ఈరోజు శుభం.. ఏ రాశులకు అశుభం. కొత్త పనులు ప్రారంభించడానికి ఏ రాశులకు ఉత్తమం తెలుసుకుందాం… ఈ 26-07-2025 రోజున మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం…

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కర్కాటకం నుంచి సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆశ్లేష, మాఘ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. అంతేకాదు శుక్రుడు, గురుడి ప్రభావంతో లక్ష్మీ యోగం కూడా ఏర్పడనుంది.

మేషం 26-07-2025

​మేష రాశి వారికి ఈరోజు మరింత కష్టంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని పనుల్లో వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈరోజు మీ హక్కులకు సంబంధించి కొన్ని వివాదాలను ఎదుర్కోవలసి రావొచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

—————————————

వృషభం 26-07-2025

​వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త సంబంధాలను ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. మీరు వివాహం గురించి ఆలోచిస్తుంటే, ఈరోజు మీ సంబంధం నిర్ధారించబడొచ్చు. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

—————————————

మిధునం 26-07-2025

మిథున రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి చాలా సమయం పట్టొచ్చు. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

—————————————

కర్కాటకం 26-07-2025

కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు పనిలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు చేసే పనిలో విజయం కారణంగా మీకు చాలా గౌరవం లభిస్తుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

—————————————

సింహం 26-07-2025

సింహ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. ఈరోజు మీరు ప్రతిదానికీ స్పందించాల్సిన అవసరం లేదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

—————————————

కన్య 26-07-2025

కన్య రాశి వారు ఈరోజు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

—————————————

తుల 26-07-2025

తులా రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి.

—————————————

వృశ్చికం 26-07-2025

వృశ్చికరాశి వారికి ఈరోజు ఖర్చులు పెరగొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈరోజు మీ పని విషయంలో కొంత కష్టంగా ఉంటుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది.

—————————————

ధనస్సు 26-07-2025

ధనుస్సు రాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ప్రతిదానికీ స్పందించాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

మకరం 26-07-2025

మకర రాశి వారికి ఈరోజు జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది.

—————————————

కుంభం 26-07-2025 

కుంభ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడొచ్చు. ఇది మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. ఈరోజు మీ మనస్సు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మిత్రుల నుంచి శుభవర్తలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

—————————————

మీనం 26-07-2025

మీన రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి. మీ కృషి, ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్