Saturday, September 13, 2025 01:12 AM
Saturday, September 13, 2025 01:12 AM
roots

సంక్రాంతి విన్నర్ బాలయ్యే..!

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాబి కొల్లి డైరెక్షన్లో, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఆదివారం గ్రాండ్ గా రిలీజ్ అయింది. అఖండ సినిమా తర్వాత నుంచి కథలు విషయంలో బాలకృష్ణ చాలా పక్కాగా ఉంటున్నారు. ఖచ్చితంగా సినిమా చేస్తే హిట్టు కొట్టాలి అనే టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళుతున్నారు. అందుకు తగ్గట్టుగానే డాకు మహారాజ్ కథను కూడా సెలెక్ట్ చేసుకున్నారు.

Also Read: వైసీపీకి వరుస అవకాశాలు ఇస్తున్న టిడిపి..!

యాక్షన్ సినిమాలంటే బాలకృష్ణ.. బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలు అన్నట్లుగానే ఉంటుంది. మాస్ ఆడియన్స్ కు బాలయ్య సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా పండగతో సమానం. సంక్రాంతికి బాలకృష్ణ సినిమా అంటే ఆ ఉండే క్రేజ్ కూడా అలాగే ఉంటుంది. ఇక డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా దుమ్ము రేపాయి అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రాణం పెట్టాడు. కొన్ని సీన్స్ లో అయితే పూనకాలు వచ్చే రేంజ్ లో ఉందంటూ నార్మల్ ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Also Read: బాలయ్య సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాలో ప్రసంశలు

మాస్, క్లాస్ ఆడియన్స్ కు తగ్గట్టుగా బాలయ్యను చూపించాడు డైరెక్టర్. కొన్ని సన్నివేశాల్లో సినిమా కాస్త లాగినట్లు కనిపించినా ఆ తర్వాత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని టాక్. బాలయ్య సినిమా అనగానే ముందు యాక్షన్ సీన్లు ఎలా ఉంటాయో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే డైలాగులు కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రెండింటి విషయంలో డైరెక్టర్ బాబి కొల్లి పక్కా ప్లాన్ చేసుకునే దిగాడు. ఎమోషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డాకు మహారాజ్ గా ఎలా మారతాడు అనేదాన్ని పక్క విజన్ తో చాలా కొత్తగా చూపించాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్