Friday, September 12, 2025 07:00 PM
Friday, September 12, 2025 07:00 PM
roots

ఆంధ్రప్రదేశ్ కు భారీ ముప్పు…?

ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్లతో భారీ ముప్పు పొంచి ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇప్పుడు వరుస తుఫాన్ లు ఏం చేస్తాయో అనే ఆందోళన రైతులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా నెలకొంది. గతంలో తుఫాన్ లు అంటే రైతులు మాత్రమే భయపడేవారు. కాని ఇప్పుడు వరదల దెబ్బకు సామాన్యులకు కూడా కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇప్పుడు వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు మరింత కలవరపెడుతున్నాయి. అక్టోబర్ 10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మూడు తుపాన్లు ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది అంటున్నారు అధికారులు. దీనితో భారీ ముప్పు పొంచి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు పెద్దగా తీవ్రంగా లేకపోయినా ఇక్కడి నుంచి పడే వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏపీకి అమరావతి వాతావరణ కేంద్రం కీలక వర్ష సూచన చేసింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది. మరోవైపు ఇదే నెలలో అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ కంటే… బంగాళాఖాతంలో ఏర్పడే 2 తుపాన్లు బీభత్సం సృష్టించినా ఆశ్చర్యం లేదని వాతావరణ శాఖ నిపుణులు అంచనాకు వచ్చారు. గతంలో ఈ నెలలో వచ్చిన తుఫాన్ లు ఏపీని బాగా ఇబ్బంది పెట్టాయి. ఈ తుపాన్ల ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

పోల్స్