Friday, August 29, 2025 09:11 PM
Friday, August 29, 2025 09:11 PM
roots

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది పాత సామెత.. ఇప్పుడు ఈ సామెత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. నిజమే.. కొంతమంది అధికారులు చేస్తున్న పనులు విపక్షాలు అస్త్రాలుగా మారుతున్నాయి. పనులన్నీ వేగంగా జరుగుతున్నప్పటికీ.. అవినీతి ఆరోపణలు చేసేందుకు కూటమి సర్కార్ అవకాశం ఇస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఏపీ సీఆర్‌డీఏ పర్యవేక్షిస్తోంది.

Also Read : ఎందుకు ఇన్ని ఆరోపణలు.. ఏమైంది వీరికి..?

ఏపీ సీఆర్‌డీఏకు ఇప్పటి వరకు సొంత భవనం లేదు. విజయవాడ లెనిన్ సెంటర్‌లోని వీజీటీఎం భవనంలోనే కొనసాగుతోంది. దీంతో అమరావతిలో సొంత భవనం నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఇందుకోసం రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే 3.62 ఎకరాలు కేటాయించారు. భవన నిర్మాణం కోసం రూ.82 కోట్లు కేటాయించారు. 2.42 లక్షల చదరపు అడుగులతో 7 అంతస్తుల్లో ఈ భవనం నిర్మిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఆర్‌డీఏ భవన నిర్మాణం పట్టాలెక్కింది. ఈ భవనం నిర్మాణం వంద రోజుల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించారు. అయితే ఆ వంద దాటి మరో వంద కూడా అయ్యింది. అయితే ఇప్పుడు ఈ భవనానికి అదనపు హంగుల కోసం చేసే ఖర్చు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం ఇంటీరియర్ కోసమే రూ.160 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు కూడా.

Also Read : ఎన్టీఆర్ విత్ నీల్.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. ?

అయితే ఇక్కడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే రూ.160 కోట్లతో అత్యాధునికమైన వసతులతో ఓ భవనం నిర్మించవచ్చు అనే మాట వినిపిస్తోంది. ఈస్థాయిలో కేటాయించడంపై టీడీపీ సీనియర్ నేతలు కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కూడా. అభివృద్ధి పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధాగా ఖర్చు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. మరికొందరైతే.. సీఆర్‌డీఏ భవనం ఇంటీరియర్‌కే ఈ స్థాయిలో కేటాయిస్తే.. ఇక సీఎంఓ, మంత్రుల ఛాంబర్‌లు, సచివాలయం కోసం ఏ రేంజ్‌లో కేటాయింపులు ఉంటాయో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సీఆర్‌డీఏ ఇంటీరియర్ కేటాయింపులు.. ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లుగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

ఆ విషయంలో వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో...

పోల్స్