గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులకు దిగింది. క్షిపణి దాడుల్లో 80 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ దాడులు జరిగిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, పాకిస్తాన్ కు ధీటుగా జవాబు ఇస్తున్నామని సైన్యం పేర్కొంది.
Also Read : 1971 తర్వాత తొలిసారి.. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు చుక్కలు
ఇక ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిగిన ఈ దాడులపై పలు దేశాల అధినేతలు స్పందించారు. ఇది తాము ఊహించలేదని, యుద్ధం త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేసారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్ లో పోస్ట్ చేసారు. భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పోస్ట్ చేసారు. ఇక రెండు దేశాల మధ్య సమస్యను శాంతియుతంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఇక పలు దేశాలకు భారత్ ఈ దాడులను వివరించింది.
Also Read : కూటమి సర్కారుపై జగన్ ముఠా మరో కొత్త వ్యూహం..!
పాకిస్తాన్‌పై భారత్ దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది, అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు ప్రతిస్పందనగా ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. ఇక అరబ్ ఎమిరేట్స్ కూడా ప్రకటన విడుదల చేసింది. సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించడానికి, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం రెండు దేశాలు ప్రయత్నం చేయాలని కోరింది. నియంత్రణ రేఖ వెంబడి.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సైనిక కార్యకలాపాల గురించి సెక్రటరీ జనరల్ చాలా ఆందోళన వ్యక్తం చేసారు.