ఏపీలో నారా లోకేష్ దూకుడు కొనసాగుతుంది. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తన్న హామీని అమలులోకి రావడంతో పార్టీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ హామీ ఇస్తే తప్పక నెరవేరుతుంది అన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. యువగళంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులకు మాజీ సైనికోద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : వైసీపీకి బాలినేని రాజీనామా వెనుక వైవీ సుబ్బారెడ్డి
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతూ.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో.. కూటమి నేతలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారంటూ అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. జీవోనెంబర్ 57, 191 లను కూడా ప్రభుత్వం అమలు చేసి తమకు మేలు చేయాలన్నారు. జీవో నెంబర్ 357 ప్రకారం ప్రభుత్వం నియమించే నియామకాల్లో 2% ఉద్యోగాలను మాజీ సైనికులకు కేటాయించినా దాన్ని అమలు చేయలేదని.. దాన్ని కూడా అమలు చేయాలన్నారు.
గత ప్రభుత్వంలో మాజీ సైనికుల సమస్యలను అసలు పట్టించుకోలేదన్నారు. మాజీ సైనికులకు హక్కుగా వస్తున్న జాబులను తమకు అందేలా చూడాలన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2లలో 2% రిజర్వేషన్ ను 5 శాతంకు, గ్రూప్ 3, గ్రూప్ 4 లలో 10% శాతంకు పెంచాలని వారు అభ్యర్థించారు. మాజీ సైనికులందరిని ఓసీలుగా పరిగనిస్తున్నారని.. అన్ని కులాల వారు అందులో ఉన్నా oc లుగా పరిగనించడంతో మాజీ సైనికులకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కడంలేదన్నారు.