తాము అధికారం కోల్పోయిన ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తోంది కాంగ్రెస్. ఢిల్లీకి ఎగువన ఉన్న రాష్ట్రాల్లో బిజెపికి ఇప్పటి వరకు ఒక్క రాష్ట్రమే మిగలగా ఆ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ లాక్కుంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో 90 స్తానాల్లో కాంగ్రెస్ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హర్యానాలో 93 స్థానాల్లో 62 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనపడుతోంది. ఇతర పార్టీల ప్రభావం ఇక్కడ చాలా తక్కువగా ఉంది.
హర్యానాలో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. క్రమంగా బిజెపి దేశంపై పట్టు కోల్పోయే అవకాశం ఉందని కేకే సర్వే అధినేత కిరణ్ కూడా ప్రకటించారు. వాళ్ళ అంచనాలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ పూర్తిగా బిజేపిని తుడిచిపెట్టేసింది. దీనితో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో సందడి మొదలైంది. గతంలోనే హర్యానాలో కాంగ్రెస్ అధికారం చేపట్టాల్సి ఉన్నా చౌతాలాను అడ్డం పెట్టుకుని మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పని తీరుపైనే ప్రజల్లో అసంతృప్తి ఉంది.
ఇక ఇండియా మ్యాప్ కు పైన ఉండే రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు ఇక లేవు. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. పంజాబ్ లో ఆప్, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వస్తోంది. ఒక్క లడఖ్ మాత్రమే అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం. హర్యానా లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. జమ్మూలో మాత్రమే బిజెపి ఆధిపత్యం ఈ ఎన్నికల్లో కనపడింది. కాశ్మీర్ లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది కాంగ్రెస్.