Friday, September 12, 2025 11:07 PM
Friday, September 12, 2025 11:07 PM
roots

భాద్యత మర్చిపోతే మంత్రులైనా, అధికారులైనా ఒక్కటే.. బాబు హెచ్చరిక

ఒకవైపు విజయవాడలో భారీ వరదలు ఇబ్బంది పెడుతున్న సమయంలో కొందరు అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై సిఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. నిన్న ఆహార పంపిణీ విషయంలో కూడా కొందరు అధికారులు అలసత్వం ప్రదర్శించడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో అంట కాగిన అధికారులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి ఓ మంత్రి తీసుకెళ్లగా… సదరు అధికారిని అక్కడి నుంచి చంద్రబాబు పంపినట్టు వార్తలు వచ్చాయి. నేడు మరోసారి అధికారులపై సిఎం సీరియస్ అయ్యారు.

ఎన్ టీ ఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకు డ్రోన్ ద్వారా ఆహారం ఇచ్చే ఏర్పాట్లు చేశాం అని అన్నారు. హెలికాప్టర్ లు, బుల్డోజర్ లు, ప్రోక్లైనర్స్ తో కూడా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, మంత్రులు అంతా సహాయక చర్యల్లో ఉన్నారన్న ముఖ్యమంత్రి బాధితులకు న్యాయం చేయడంలో ఎవరూ అలసత్వం చూపించవద్దు అని హెచ్చరించారు. ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇళ్లలోకి పాములు, తేళ్ళు వస్తున్నాయన్నారు చంద్రబాబు. ప్రజలను ఇబ్బందుల నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు ఆయన.

Read Also : వైసీపీ పై బాబు ఫోకస్.. రాజీనామా బాటలో కీలక నాయకులు

ఫీడ్ బ్యాక్ కోసం నేనే ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా అని బాధితులు రెస్పాండ్ అవ్వండని కోరారు. వాస్తవాలు చెప్పండి, అవసరమైన చోట సరిదిద్దుకుంటామని ప్రజలను కోరారు. డబ్బులు అసలు సమస్యే కాదు, ఎంత డబ్బులు ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన ప్రజలు కూడా కాస్త ఓపిక పట్టండి, ఆలస్యం అయితే అరగంట అవుతుంది, అన్నీ సేవలు అందరికీ అందుతాయని స్పష్టం చేసారు. జక్కంపూడి లో ఒక అధికారి సరిగా స్పందించకపోతే సస్పెండ్ చేశానని ఎవ్వరినీ ఉపేక్షించను అని వార్నింగ్ ఇచ్చారు. మంత్రులను కూడా వదలను, బాధ్యతగా వ్యవహరించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్