Friday, September 12, 2025 01:11 PM
Friday, September 12, 2025 01:11 PM
roots

ఏపీ ఫ్యూచర్ సీఎంపై క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారా.. కొత్త నేత 2029లో వస్తారా.. లేక ఈ లోపే అధికారంలోకి వస్తారా.. ఏపీ పగ్గాలు యువ నేత చేతికి ఎప్పుడు వెళ్తాయి. ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. రాబోయే ఎన్నికల్లో పోటీ ఎవరెవరికి అనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రధానంగా ప్రముఖ సర్వే సంస్థ రైజ్ గ్రూప్ అధినేత ప్రవీణ్ పుల్లాట సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో విమర్శలు చేసే ప్రవీణ్ పుల్లాట.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ మార్పులపైన, పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్లపైన తనదైన శైలిలో కామెంట్ చేశారు.

Also Read : రాహుల్ అరెస్ట్.. ఢిల్లీలో అలజడి వాతావరణం

వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పెను మార్పులు తప్పవనేది ముందు నుంచి వినిపిస్తున్న మాట. ఇందుకు ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వయస్సును కారణంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 76 ఏళ్లు. దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత విమర్శలు కూడా చేశారు. “చంద్రబాబు మరో మూడేళ్లల్లో ఎలాగూ పోతాడు” అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబును దగ్గరగా చూసిన వారు మాత్రం.. మరో పదేళ్ల వరకు ఎలాంటి ఢోకా లేదంటారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటనే విషయం ఇప్పటికీ ఏపీలో హాట్ టాపిక్. అయితే సీఎంగా ఆయన కొనసాగే పరిస్థితి లేదంటున్నారు కొందరు నేతలు. ఈ వయస్సులో ఆయన తలకు మించిన భారం పెట్టుకోవటం ఏమిటి.. క్రమంగా తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి కొత్త పేరు వచ్చింది.

Also Read : ఉప ఎన్నికల్లో గెలుపెవరిది..?

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నప్పటికీ.. పార్టీ బాధ్యతలు చూసేది మాత్రం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం నారా లోకేష్ చాలా కీ రోల్ పోషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను శాసించే స్థాయిలో లోకేష్ ఉన్నారనేది ప్రభుత్వంలో వినిపిస్తున్న మాట. ప్రభుత్వంలో, పార్టీలో ఏం జరగాలన్నా సరే.. లోకేష్ అనుమతి తప్పని సరి అనేది బహిరంగ రహస్యం. అటు పార్టీలో ముఖ్యనేతలు కూడా లోకేష్‌ను భవిష్యత్ నేతగా పదే పదే అభివర్ణిస్తున్నారు. ఈ మాటలు నిజం చేసేలా ప్రవీణ్ పుల్లాట పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : మళ్ళీ మొదలైన నందమూరి ఫ్యాన్ “వార్”..!

“2029 టీడీపీ సీఎం అభ్యర్థిగా నారా లోకేష్! ఇప్పటికీ సొంత టీమ్ ఏర్పాటు, పలు మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ.. రానున్న రెండేళ్లలో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు.. (సశేషం)” అంటూ ప్రవీణ్ చేసిన పోస్టు.. పెద్ద దుమారం రేపుతోంది. వాస్తవానికి కూటమి పార్టీల సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే చంద్రబాబు పేరు ప్రకటించారు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీంతో అప్పటి వరకు పవన్ సీఎం అంటూ అభిమానులు చేస్తున్న ప్రచారానికి బ్రేక్ పడింది. చంద్రబాబు తర్వాత పవన్ సీఎం అవుతారని అంతా భావిస్తున్నారు. అయితే ఇటీవల పలు సందర్భాల్లో ఏకంగా చంద్రబాబు ఎదుటే లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. వీటిపై చంద్రబాబు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఏపీలో ఇద్దరు డిప్యూటీలు.. అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది.

అయితే ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా.. సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టిన లోకేష్.. యువతకే ఎక్కువ ప్రాధాన్యత అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో తన ప్రభావం పెంచుకునేలా అడుగులు కూడా వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపునకు లోకేష్ యువగళం పాదయాత్ర మాత్రమే కారణమనేది ఆయన వర్గం మాట. 2029 నాటికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలను లోకేష్ చేపట్టే అవకాశాలున్నాయనేది పార్టీలో వినిపిస్తున్నా మాట. మరి ప్రవీణ్ పుల్లాట వ్యాఖ్యలు నిజమా.. కాదా.. తెలుసుకోవాలంటే.. మరో రెండేళ్ల పాటు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్