Monday, October 27, 2025 07:54 PM
Monday, October 27, 2025 07:54 PM
roots

ఆ చిన్నారి పెయిడ్ ఆర్టిస్ట్.. ప్రూఫ్ లతో సెటైర్లు

మార్కెటింగ్ చేసుకునే విషయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ చాలా మంది నాయకుల కంటే ముందుంటారు. తాజాగా విజయవాడ జైలు వద్దకు వెళ్ళిన వైయస్ జగన్ తిరిగి వెళ్లే సమయంలో ఓ చిన్నారి చేసిన హడావుడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ ను కలవాలని ఆ చిన్నారి ఏడవడం.. ఆ తర్వాత జగన్ ఆ చిన్నారిని దగ్గరకు తీసుకోవడం, యధావిధిగా ముద్దు పెట్టడం ఇవన్నీ జరిగాయి. ఇది చూసిన జనాలు ఒక్కసారిగా కంగుతున్నారు. జగన్ దగ్గరికి తీసుకునే ముందు పాప ఏడుస్తున్న వీడియో చూసిన కొంతమంది కచ్చితంగా ఆ పాప పెయిడ్ ఆర్టిస్ట్ అని కౌంటర్లు వేస్తున్నారు.

Also Read : రేవంత్ ఇచ్చేస్తున్నాడు.. చంద్రబాబు ఎప్పుడు…?

జగన్ పర్యటనల్లో ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతాయని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ వీడియోను వైసిపి సోషల్ మీడియా పెద్దగా షేర్ కూడా చేయకపోవడం గమనార్హం. ఇక జగన్ ను కలిసిన తర్వాత ఆ చిన్నారిని సాక్షి ఛానల్ పలకరించింది. ఈ సందర్భంగా చిన్నారి కాస్త ఆశ్చర్యకరంగమైన వ్యాఖ్యలు చేసింది. తమకు అమ్మ ఒడి రావటం లేదని, ఇబ్బందులు ఉన్నాయని ఇల్లు గడవడం లేదంటూ ఆ చిన్నారి కొన్ని మాటలు మాట్లాడింది. కాని ఆ చిన్నారిని చూసిన వాళ్ళు మాత్రం.. ఆమె రిచ్ కిడ్ అంటూ క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు.

Also Read : ఆ ఇద్దరి కోసం అగార్కర్, గంభీర్ మధ్య వాగ్వాదం

దీనిపై ఇప్పుడు టిడిపి జనసేన గట్టిగానే సెటైర్లు వేస్తున్నాయి. ఇక చిన్నారి మాట్లాడిన తీరు, ఏడ్చిన తీరు చూసిన వాళ్లు కచ్చితంగా ఆమెది నటన అనే అభిప్రాయాన్ని… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తన పర్యటన గురించి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలకు స్టఫ్ ఇవ్వడానికి జగన్ ఈ విధంగా ప్లాన్ చేశారని, ఇక జగన్ పి ఆర్ టీం కూడా చాలా గట్టిగా ఉంటుందని.. మరి కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా జగన్ పర్యటనల్లో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ విషయాన్ని వైసిపి ఫోటోగ్రాఫర్లు కవర్ చేసిన విధానం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏకంగా నాలుగు యాంగిల్స్ నుంచి ఈ సన్నివేశాలను కవర్ చేశారు వైసీపీ సోషల్ మీడియా ఫోటోగ్రాఫర్లు. ఇది చూసిన జనాలు కచ్చితంగా ప్రీ ప్లాన్ తోనే చిన్నారిని రంగంలోకి దించారని కౌంటర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్