ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ఈ సీజన్లో దాదాపుగా ముగిసినట్లుగానే కనబడుతోంది. వరుసగా మ్యాచులు ఓడిపోతున్న చెన్నై బ్యాటింగ్ విభాగంలో రోజురోజుకీ మరింత దారుణంగా మారుతుంది. ఒకప్పుడు ప్రత్యర్థులు చెన్నై బ్యాటింగ్ లైన్ అప్ చూసి భయపడిపోయిన పరిస్థితులు ఉండేవి. అలాంటి చెన్నై బ్యాటింగ్ నేడు అభిమానులను కన్నీరు పెట్టిస్తోంది. కనీసం ఫోర్ గాని సిక్స్ గాని కొట్టడానికి చెన్నై మిడిల్ ఆర్డర్లో ఏ ఒక్క ఆటగాడు సమర్థవంతంగా కనపడటం లేదు.
Also Read : బాగా బ్యాడ్ అయ్యా…కాస్త సరిచేయండి
టి20 క్రికెట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయం వరిస్తుంది అనేది అందరూ చెప్పే మాట. ముందు బ్యాటింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటింగ్ శైలి మాత్రం మారడం లేదు. ఓపెనర్ల నుంచి లోయర్ మిడిల్ ఆర్డర్ వరకు కనీసం 180 నుంచి 200 స్కోర్ చేయాలని తపన ఎవరిలోనూ కనబడలేదు. సురేష్ రైనా ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత చెన్నై ఒక్కసారి కూడా 180 స్కోర్ చేజ్ చేయలేకపోయింది. అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : రాహుల్ కోపం ఎవరిపై..?
ముందు బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో 230 వరకు చెన్నై స్కోర్ చేసిన మ్యాచ్లు ఉన్నాయి. ఇక తాజాగా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ సింగ్ ధోని ఆట తీరుపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కీలక సమయంలో కూడా ధోని చివరిలో బ్యాటింగ్ కు రావడం ఏంటి అనేది అభిమానుల ప్రశ్న. వచ్చినా నిదానంగా బ్యాటింగ్ చేయడం, చెన్నై బ్యాటింగ్ చూస్తుంటే రాబోయే మ్యాచ్లో కూడా గెలిచే అవకాశాలు కనబడటం లేదు. ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఈ సీజన్లో చెన్నై విజయం సాధించింది.