అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగ విప్పింది. ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ కు గురి పెట్టింది. పక్కా ప్లానింగ్ తో ఉటాలో అతన్ని కాల్చి చంపేశారు అని అమెరికా మీడియా వెల్లడించింది. ముందు అతనిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాని అతను తప్పించుకున్నాడు అనే మరో కథనం సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు అతనిని ఎఫ్ బీఐ అధికారులు అదుపులోకి తీసుకోలేదు. దీనిపై అమెరికా మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
Also Read : నేపాల్ పరిస్థితి.. పవన్ కీలక ఆదేశాలు
అతను ఓ బిల్డింగ్ మీద దాక్కున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విడుదల చేసారు అక్కడి పోలీసులు. అతని కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు. సాల్ట్ లేక్ సిటీ సమీపంలోని ఒరెమ్లోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మధ్యాహ్నం 2:20 గంటల ప్రాంతంలో (స్థానిక సమయం) బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా 31 ఏళ్ల చార్లీని కాల్చి చంపేశారు.
Also Read : రష్యా – ఉక్రెయిన్ యుద్దంలో భారతీయలు.. కేంద్రం కీలక ప్రకటన
ఓ బిల్డింగ్ పై నుంచి కాల్పులు జరిగాయని ముందు భద్రతా అధికారులు చుట్టుముట్టారు. ఆ తర్వాత మరో చోట కాల్పుల శబ్దం వినపడింది అంటూ స్థానికులు చెప్పడంతో పోలీసులు అటు వెళ్ళడంతో నిందితుడు తప్పించుకుని ఉండవచ్చు అంటూ అమెరికా మీడియా పేర్కొంది. బుల్లెట్ కిర్క్ మెడకు తగిలిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ నిందితుడుని గుర్తించడం అధికారులకు సవాల్ గా మారింది. అసలు ఏ వైపు నుంచి కాల్పులు జరిపాడు అనేది స్పష్టత రాలేదు. సీసీ కెమెరాల్లో కూడా అతను ఏ వైపుకు వెళ్ళింది గుర్తించడం కష్టంగా మారింది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడితో పాటుగా ప్రముఖులకు భద్రత పెంచారు.