ఏపిలో టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా టిడిపి కార్యకర్తల కంటే వైసీపీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందన్న ఆరోపణ కార్యకర్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం టిడిపి అధినేత చంద్రబాబు వద్దకు చేరడంతో టిడిపి నాయకులకి గట్టిగా హెచ్చరిక చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలన్న సీఎం… గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావివ్వకూడదు అని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలన్నారు సీఎం.
Also Read : మౌనమే.. విజయసాయి రెడ్డిపై సైలెంట్ గా వైసీపీ
ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని నేతలను హెచ్చరించారు చంద్రబాబు. నేను ఈ విషయాన్ని చెప్తే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదన్నారు చంద్రబాబు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకి అతీతంగా సంక్షేమ పధకాలు అందాలని సూచించారు. ఇప్పటికే పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకి కూడా పధకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ పరమైన సంబంధాలు వేరన్నారు. ఈ సందర్భంగా నామినేటేడ్ పదవులపై కూడా చంద్రబాబు మాట్లాడారు.
Also Read : అమీర్ ఖాన్ డేటింగ్‌లో ఉన్న అమ్మాయి ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామన్నారు. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదువుల కోసం అందించాలని సూచించారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్‌లను నియమిస్తామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి, అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని… మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దన్నారు. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని… మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని సూచించారు.




