Monday, October 27, 2025 10:28 PM
Monday, October 27, 2025 10:28 PM
roots

బిజెపి పై చంద్రబాబు బృందం తీవ్ర అసహనం

ఏపీలో జరగనున్న ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. ఉనికి కాపాడుకోవాలి అంటే తప్పకుండా గెలవాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కూటమిలో సమన్వయం కోసం అంతర్గతంగా ఓ టీం పని చేస్తుంది. పొత్తులు, రాష్ట్రవ్యాప్తంగా అంతర్గత సమస్యలు, పార్టీలకు మధ్య సమన్వయం వంటివి ఈ టీం చూస్తుంది. అయితే భాగస్వామ్య పార్టీ అయిన బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై ఈ బృందం అనుమానంతో పాటు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అనవసరంగా బిజెపితో పొత్తు పెట్టుకున్నామని మదనపడుతోందని తెలుస్తుంది.

వాస్తవానికి బిజెపితో పొత్తు టిడిపి శ్రేణులకు ఇష్టం లేదు. మెజారిటీ క్యాడర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కూడా. కానీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నుంచి సాయం అందుతుందని భావించి చంద్రబాబు అతి కష్టం మీద బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇందుకు క్యాడర్ ని కూడా సమాయత్తం చేసి శాంతింపచేశారు. అయితే ఇంతవరకు బిజెపి నుంచి అటువంటి సాయం అందడం లేదు. ఏదో కంటితుడుపు చర్యగా ఒకరిద్దరు అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర డిజిపి తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయాలని టిడిపితో పాటు జనసేన మరియు రాష్ట్ర బిజెపి కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప స్పష్టమైన ఆదేశాలంటూ జారీ కావడం లేదు. అటువంటప్పుడు పొత్తు పెట్టుకుని ఏం లాభం అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్తమవుతోంది.

మరోవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల నిర్ణయాలు రావడం లేదు. ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో సానుకూలత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జనసేన తో పాటు ఇండిపెండెంట్ లకు సైతం గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఇది గందరగోళానికి కారణం అవుతోంది. బిజెపి ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి చేయడంలో విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక పార్టీకి కేటాయించిన గుర్తు మరెవరికీ ఇవ్వకూడదు. జనసేన కి కేటాయించిన గాజు గ్లాసు గుర్తు, జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు కేటాయించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

నెల రోజుల కిందట చిలకలూరిపేట ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అటు తరువాత బిజెపి అగ్ర నేతలు ఏపీ వైపు చూడలేదు. మే మొదటి వారంలో భారీ బహిరంగ సభలకు హాజరవుతారని భావించారు. కానీ అవి ఆరు, ఏడు తేదీలకు వాయిదా పడ్డాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా బిజెపి అగ్రనేతలు, బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని టిడిపి భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే ఈ పరిణామాలన్నీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయన్నది టిడిపి భావన. అందుకే బిజెపితో పొత్తు విషయంలో టిడిపిలోనే ప్రత్యేక బృందం మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్