Saturday, September 13, 2025 05:16 AM
Saturday, September 13, 2025 05:16 AM
roots

ఆ 5 ఏళ్ళు మర్చిపోను.. చంద్రబాబు సంచలన కామెంట్స్

రాజ్యాంగం ఆమోద దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని అనేక దేశాల రాజ్యాంగాలను పరిశోధించి అందులో ఉన్నతమైన వాటిని తీసుకొని, తనకున్న అనుభవంతో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్న చంద్రబాబు… 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి రాసిన మహోన్నత గ్రంధం రాజ్యాంగం అని పేర్కొన్నారు. అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయంగా సమతుల్యం తీసుకూరావాలని, అందరికి సమానావకాశాలు తీసుకురావాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారని తెలిపారు.

Also Read : మరో మాజీ ఎమ్మెల్యేకి ఎర్త్ పెట్టిన బాబు సర్కార్

ఎంత మంచి రాజ్యాగం ఉన్నా దానిని అమలు చేసేవారు చెడువారైతే చెడుగా మారుతుతుందన్నారు. ఎంత చెడు రాజ్యాగమైనా దానిని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిగా మారుతుందని అంబేద్కర్ అన్నారని వివరించారు. ఓటు అనేది పవిత్రమైన సైలెంట్ రెవిల్యూషన్… అంబేద్కర్ ఇచ్చిన ఓటు చూస్తే బలవంతులు, బలహీనులు అందరికీ ఓటు వుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా దానిని సరిచేసే శక్తి ఓటుకు ఉందన్నారు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు వచ్చాయని వివరించారు.

Also Read : కల్తీ లడ్డూ కేసులో కీలక పరిణామం

45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న చంద్రబాబు… ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రాధమిక హక్కులను కాలరాసే పరిస్థితులు చూశామన్నారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అని.. సాంఘిక, ఆర్థిక రాజకీయ అసమానతలు ఉన్నాయన్నారు… అందరి మనోభావాలు గుర్తు పెట్టుకోవాలన్నారు. కులం, మతం, ప్రాతం పేరుతో విడిపోతే ప్రమాదం వస్తుందని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలు మరచిపోదామనుకున్నా అని, కాని మర్చిపోయే సమస్యే లేదన్నారు. గత ఐదు సంవత్సరాల జివోలతో పాటు, ఇప్పుడిచ్చే జివోలను కూడా ఆన్ లైన్ లో పెట్టి ముందుకు పోతున్నామన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్