2014 నుంచి 19 వరకు చంద్రబాబు పరిపాలనలో .. ఆయన పరిపాలనా శైలి చూసి ప్రజలు, పరిశీలకులు ఒక కామెంట్ బాగా చేసేవాళ్ళు… జగన్ కు అనవసరంగా ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు అని… చాలా సందర్భాల్లో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేసే ధోరణి అలాగే ఉండేది. అందుకే జగన్ రెచ్చిపోయి… ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి అలవికాని హామీలు ఇచ్చి, ఒక్క ఛాన్స్ అంటూ సిఎం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సిఎం అయ్యారు. కానీ గతంలో చంద్రబాబు కాదు ఇప్పుడు ఉన్నదీ.
పక్కా ప్లానింగ్ తో, పక్కా లెక్కలతో, పక్కా వ్యూహంతో జగన్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా జగన్ కు ఛాన్స్ ఇవ్వలేదు ఈ మూడు నెలల్లో. అంటే చంద్రబాబు ఎంత పక్కాగా ఉన్నారో చెప్పవచ్చు. పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లు లేకుండా జరగదు అనుకున్నా, ఇంతకముందు కంటే మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా పంపిణీ జరుగుతుంది. తల్లికి వందనం విషయంలో ట్రోల్ చేసినా… అక్కడ కూడా క్లారిటీ వచ్చేసింది. కేంద్ర బడ్జెట్ లో టార్గెట్ చేయాలని చూసి ప్రత్యేక హోదా సహా ఎన్నో మాట్లాడాలని జగన్ ప్లాన్ చేసినా అది కూడా సాగలేదు. కేంద్రం భారీగా నిధులు కేటాయించింది.

ఇటీవల విశాఖలో జరిగిన ఒక ఫ్యాక్టరీ ప్రమాదంలో కోటి రూపాయలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేయక ముందే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ చెక్కులు కూడా ఆలస్యంగా ఇవ్వకుండా… ప్రమాదం జరిగిన మూడో రోజే ఇచ్చేసారు. కాబట్టి జగన్ అక్కడ ఏం మాట్లాడలేకపోయారు. ఇక వరదల విషయంలో కూడా జగన్ కు ఏం చేయాలో తోచడం లేదు. అందుకే సైలెంట్ గా బెంగళూరు వెళ్ళిపోయారు. చంద్రబాబు క్షేత్ర స్థాయిలో ఉండి పని చేయడం, కేంద్రం నుంచి సహకారం అందడంతో జగన్ కు ఛాన్స్ దొరకలేదు.
Also Read: బెజవాడ వరదలు… ఆ ముగ్గురే హీరోలు
తన అనుకూల అధికారులతో ఇబ్బంది పెట్టాలని చూసినా సరే సాధ్యం కాలేదు. అటు బాధితులతో జగన్ మాట్లాడి విమర్శించే ప్రయత్నం చేసినా బాధితులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే రియాక్ట్ అయ్యారు. అలాగే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేసే విషయంలో వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ చేసే వరకు కూడా టైం ఇవ్వలేదు. గంటలోనే సస్పెండ్ చేసారు. ఇలా పాలనలో చంద్రబాబు కొత్తగా కనపడుతున్నారు. అందుకే వైసీపీ సైలెంట్ అయిపొయింది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో జగన్ కి మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావొచ్చు అని పరిశీలకుల అభిప్రాయం. మరి జగన్ వాటికి సిద్దమేనా?