Tuesday, October 28, 2025 06:56 AM
Tuesday, October 28, 2025 06:56 AM
roots

జమిలి ఎన్నికల పై బాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కీలక కామెంట్స్ చేసారు. హర్యానా ఎన్నికల్లో బిజెపి విజయంపై స్పందించిన ఆయన హర్యానా ఎన్నికలల్లో మూడవ సారి బిజెపి అధికారంలోకి వచ్చిందని ఇదొక హిస్టారికల్ విక్టరీ అని కొనియాడారు. అనేక ప్రచారాలు జరిగాయి… కానీ అవి ఏవీ పని చెయ్యలేదన్నారు. ప్రధాన మంత్రి.. అమిత్ షా.. నడ్డ మంచి పనులు చేస్తే విజయాలు ఎలా వస్తాయి అనే దానికి నిదర్శనం అని అభినందించారు. ఈ విజయానికి హర్యానా ప్రజలను కూడా నేను అభినందిస్తున్నానన్నారు చంద్రబాబు. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడం శుభపరిణామం అని కొనియాడారు.

జమ్మూ కాశ్మీర్ లో కూడా బిజెపి బలమైన పార్టీ గా ఎదిగిందని జమ్మూ కాశ్మీర్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత పరిణామాలకు కారణం అని తెలిపారు. ప్రస్తుత ఫలితాలే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్ని ఎన్నికలు ఒకే సారి జరగాలి… సాధారణ ఎన్నికలలో పాటు స్థానిక ఎన్నికలు కూడా జరిగితే పరిపాలనకు సమయం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక సార్లు ఎన్నికలు జరగడం వలన ఇబ్బందులు ఉంటాయన్నారు.

Also Read : రఘురామరాజు కేసులో కీలక ట్విస్ట్..! విజయ్ పాల్ ను దాచింది ఎవరు..?

విజన్ వికసిత భారత్ ప్రోగ్రాం తో రెండో.. మూడో ప్లేస్ లో భారత్ తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. 2047 కి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు వచ్చే టైం కి ఇండియా తప్పకుండా మొదటి ప్లేస్ లో ఉంటుందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఒక ఆరచక పాలన వలన రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని సౌకర్యాలు మనకి ఉన్నాయన్న ఆయన రాష్ట్రంలో రైల్వే కి రెండు లైన్స్ నీ నాలుగు లైన్స్ చేస్తున్నారని తెలిపారు. బులెట్ ట్రెయిన్ అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నారని తప్పకుండా దక్షిణభారత లో పెట్టే ఆలోచన చెయ్యాలని కోరినట్టు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ… గ్రీన్ హైడ్రోజన్ వస్తున్నాయన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్