Tuesday, October 28, 2025 05:20 AM
Tuesday, October 28, 2025 05:20 AM
roots

విమర్శలకు నో ఛాన్స్.. సంక్షేమంలో చంద్రబాబు పక్కా ప్లానింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దూసుకుపోతోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాటిని బయటకు కనపడనీయకుండా జాగ్రత్త పడుతోంది. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తోంది. 2024 ఎన్నికల్లో పెన్షన్లు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 15 వేల వరకు పెన్షన్లు పెంచి అందిస్తోంది ప్రభుత్వం. ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్నారు.

Also Read : వినాయక చవితికి నందమూరి ఫ్యాన్స్‌కు గిఫ్ట్ రెడీ..?

ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. ఈ విషయంలో విపక్షాలు ఆరోపణలు చేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం అమలైంది. ఇక మరో కీలక పథకం అన్నదాత సుఖీభవకు కూడా శ్రీకారం చుట్టింది. మొత్తం 3173 కోట్ల రూపాయలను.. రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే దీపం 2 పథకంలో భాగంగా రెండు కోట్ల రాయితీ సిలిండర్లు కూడా అందించడం గమనార్హం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని 2024 లో చంద్రబాబు హామీ ఇచ్చారు.

Also Read :‘వార్ 2’ లో ఎన్టీఆర్ విలనిజం పండలేదా..?

ఆ హామీ ప్రకారం ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమానికి స్వయంగా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి శ్రీకారం చుట్టారు. అలాగే టీచర్ నోటిఫికేషన్ లో కూడా రాష్ట్ర విద్యాశాఖ దూకుడు ప్రదర్శించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టులను ఈ నెలాఖరులో భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు పదివేల రూపాయలు అందిస్తోంది. అర్చకులు వేతనాలను సైతం 15 వేలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే సమయంలో కీలకమైన మత్స్యకారులకు 259 కోట్ల రూపాయలు అందించింది చంద్రబాబు సర్కార్. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ అమలు చేసింది చంద్రబాబు సర్కార్. సంక్షేమ కార్యక్రమాల విషయంలో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అమలు చేయడంలో కూటమి విజయవంతమైందనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్