ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉండటంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు సాధించేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారు. అటు ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరు చంద్రబాబుకు పూర్తిస్థాయిలో సహకరించటం రాష్ట్రానికి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. గతంలో కంటే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం సౌకర్యవంతంగా కనబడుతున్నారు.
Also Read : తమ్ముడిపై రివేంజ్ ప్లాన్‌లో కేసినేని నానీ.. చంద్రబాబుకు సంచలన లేఖ
ఇక తాజాగా మరోసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు కేంద్ర మంత్రులతో వరస సమావేశాలు కానున్నారు. ఉదయం 10:30 కు కేంద్రమంత్రి సి ఆర్ పాటిల్ తో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ తో పాటుగా బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఉదయం 11: 15 నిమిషాలకు అర్జున్ రామ్ మేగ్వాల్ తో భేటీ అవ్వనున్నారు. కర్నూల్ లో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్ గురించి వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది.
Also Read : బీసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ఇదే
వైసీపీ ప్రభుత్వంలో న్యాయ రాజధానిగా కర్నూలు ను ప్రకటించిన అనంతరం.. చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా చంద్రబాబు వివరించనన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం 1:40 గంటలకు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు భేటీ లిక్కర్ కుంభకోణం సహా పలు అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే మే 2న అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అమిత్ షా తో చంద్రబాబు చర్చిస్తారు. అదేవిధంగా రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అమరావతి చేరుకోనున్నారు.




