Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

ఇలా అయితే కష్టమే.. బాబు మాస్ వార్నింగ్..!

ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే… ఇప్పటి నుంచే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. అంతే తప్ప… నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం…. ఎన్నికల్లో టికెట్ కూడా రాదని స్పష్టం చేశారు చంద్రబాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మార్కాపురం నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎలా ఉన్నారంటూ నవ్వుతూ పలకరించిన చంద్రబాబు… ఆ తర్వాత మాత్రం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు పార్టీ కేడర్‌కు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.

Also Read: భువనేశ్వరి అంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో..!

అసలు మీ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందో తెలుసా అంటూ ఎమ్మెల్యేను సీఎం ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మార్కాపురం నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారన్న చంద్రబాబు.. ఆ తర్వాత ఏమైందని నిలదీశారు. గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఐదో సారి గెలిచిందని… గెలిచిన తర్వాత నుంచి రాబోయే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే అక్కడి నేతలు పని చేస్తారని సూచించారు. కానీ మార్కాపురం నేతలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేశారు కాబట్టే… నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందన్నారు.

Also Read: అమరావతి సమీపంలో మెగా టూరిజం స్పాట్..!

అయితే వన్ టైమ్ ఎమ్మెల్యే అనేది కాకుండా… ప్రతి ఒక్కరు పర్మినెంట్ ఎమ్మెల్యే అనేలా పని చేయాలన్నారు. గెలిచిన మరుసటి రోజు నుంచే తర్వాత ఎన్నికల్లో ఎలా గెలవాలనే తపన ప్రతి నేతకు, కార్యకర్తకు ఉండాలని చంద్రబాబు సూచించారు. అయితే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలో మాత్రం ఆ కసి కనిపించటం లేదని చంద్రబాబు చురకలు అంటించారు. ఎన్నికల ముందు ఎంతో మంది పేర్లు పరిశీలించినప్పటికీ… కందుల నారాయణ రెడ్డికే టికెట్ ఇచ్చామన్నారు. ఎవరైనా సరే మరోసారి గెలవాలనే లక్ష్యంతోనే పని చేస్తారన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో 15 శాతం పైగానే మెజారిటీ వస్తే… మార్కాపురంలో మాత్రం కేవలం 6 శాతం మాత్రమే మెజారిటీ సాధించారన్నారు.

Also Read: మరోసారి పార్లమెంట్ కు అశోక్ గజపతి రాజు…!

ఇలా అయితే ఎలా అని కార్యకర్తలను ప్రశ్నించారు. ఇక సభ్యత్వ నమోదు విషయంలో మార్కాపురం నియోజకవర్గం 107లో స్థానంలో ఉందన్నారు. కనీసం వంద లోపు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా రెండుసార్లు ఓడిన తర్వాత కూడా పనితీరులో మార్పు రాకపోతే ఎలా అని హెచ్చరించారు. ప్రతి నెలా కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని… రెండు నెలలకోసారి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తాను కూడా ఇకపై కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాలంటే ఇప్పటి నుంచే పని చేయాలని చంద్రబాబు సూచించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్