ఆంధ్రప్రదేశ్ లో ఇన్చార్జి మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుక్కలు చూపిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇన్చార్జి మంత్రులను చంద్రబాబు వెంటాడుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరుతో పాటుగా అక్కడి స్థానిక నాయకత్వ పనితీరును.. తెలుసుకోవడమే కాకుండా వారితో పరుగులు పెట్టించేందుకు అలాగే కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోవడానికి.. ఇంచార్జ్ మంత్రులను నియమించారు. అన్ని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు ఉండగా చాలామంది మంత్రులు జిల్లాలకు వెళ్లడం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి.
Also Read : శత్రువులుగా మారిన మిత్రులు..!
కొందరు మంత్రులు ఎక్కువగా విజయవాడలోనే ఉండటం లేదంటే హైదరాబాద్ వెళ్లడం వంటివి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉంటే తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దీనిపై చంద్రబాబు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం సందర్భంగా అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. మంత్రులకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తే అక్కడ స్థానిక నాయకత్వంతో సమస్య వస్తుందని లేదంటే కీలక నేతలతో సఖ్యత దెబ్బతింటుందనో.. జిల్లాలకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. దీనిపై పలుమార్లు మంత్రులను హెచ్చరించినా సరే మార్పు రాలేదు.
Also Read : విషం చిమ్ముతున్న వారి కోరలు పీకుతారా..?
దీనితో ఇటీవల ఇద్దరు ముగ్గురు మంత్రులను పిలిచి ఇన్చార్జి మంత్రులుగా వెళ్లడానికి మీకు ఇబ్బంది ఏంటని చంద్రబాబు స్వయంగా అడిగినట్లు వార్తలు వచ్చాయి. మంత్రులుగా మీరు ఎంత బాగా పనిచేసిన సరే జిల్లాలకు వెళ్లకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీలో జాయిన్ అయ్యే వారిపై కూడా ఇన్చార్జి మంత్రులు జిల్లాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో కోవర్టులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వారి విషయంలో సరైన సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా తమ పార్టీ కేంద్ర కార్యాలయాలకు కూడా రావడం లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. మంత్రులుగా అవకాశం ఇచ్చినప్పుడు అన్ని విధాలుగా పనిచేయాల్సి ఉంటుందని.. లేనిపక్షంలో తప్పుకోవచ్చని స్పష్టంగా చెప్పారట సీఎం చంద్రబాబు.




